Share News

Mohanbabu: నిజాలు తెలుసుకుని మాట్లాడండి.. మోహన్ బాబు ట్వీట్

ABN , Publish Date - Dec 14 , 2024 | 12:28 PM

Telangana: ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేయడంపై నటుడు మోహన్‌ బాబు తాజాగా స్పందిస్తూ.. అసలు పిటిషన్ రిజక్ట్ అవ్వలేదని చెప్పుకొచ్చారు. మీడియా నిజాలు తెలుసుకుని మాట్లాడాలని ఆయన అన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో మోహన్ బాబు పోస్టు చేశారు.

Mohanbabu: నిజాలు తెలుసుకుని మాట్లాడండి.. మోహన్ బాబు ట్వీట్
Actor Manchu Mohan babu

హైదరాబాద్, డిసెంబర్ 14: ఓ మీడియా ప్రతినిధిపై దాడికి సంబంధించి నమోదు అయిన కేసులో ముందస్తు బెయిల్‌ కోసం నటుడు మోహన్‌ బాబు (Actor Mohan Babu) దాఖలు చేసిన పిటిషన్‌‌ను తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కొట్టివేసిన విషయం తెలిసిందే. అయితే ముందస్తు బెయిల్ కొట్టివేయడంపై మోహన్‌ బాబు తాజాగా స్పందిస్తూ.. అసలు పిటిషన్ రిజక్ట్ అవ్వలేదని చెప్పుకొచ్చారు. మీడియా నిజాలు తెలుసుకుని మాట్లాడాలని ఆయన అన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో మోహన్ బాబు పోస్టు చేశారు.

అల్లు అర్జున్ కీలక కామెంట్స్..


మోహన్ బాబు ట్వీట్..

‘‘అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. నా యాంటిసిపెటరీ బెయిల్ రిజెక్ట్ కాలేదు. నా నివాసంలోనే చికిత్స పొందుతున్నాను. మీడియా నిజాలు తెలుసుకొవాలి’’ అంటూ నటుడు మోహన్ బాబు ట్వీట్ చేశారు.


కాగా.. మంచు మోహన్‌ బాబు, మంచు మనోజ్‌కు మధ్య జరిగిన వివాదం ఎంతటి దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. మంచు ఫ్యామిలీ గొడవలను ప్రశ్నించేందుకు డిసెంబర్ 10న మీడియా ప్రతినిధులు జన్‌పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ఓ మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేశారు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. అలాగే మోహన్ బాబు దాడి దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


మోహన్ బాబుపై కేసు నమోదు చేసిన పోలీసులు.. డిసెంబర్ 11న విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. నోటీసులపై మోహన్‌ బాబు హైకోర్టును ఆశ్రయించారు. తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని.. ముందు బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. అయితే మోహన్ బాబు వేసిన ముందు బెయిల్‌ పిటిషన్‌పై నిన్న(శుక్రవారం) హైకోర్టులో విచారణకు రాగా.. ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది.


మరోవైపు జన్‌పల్లి వద్ద జరిగిన గొడవల్లో మోహన్‌ బాబు కంటి వద్ద గాయం అవడంతో వెంటనే పెద్ద కుమారుడు విష్ణు ఆయనను కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. రెండు రోజుల పాటు చికిత్స అనంతరం మోహన్‌ బాబు డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు.


ఇవి కూడా చదవండి...

అద్వానీకి తీవ్ర అనారోగ్యం.. ఆసుపత్రికి తరలింపు

బన్నీ అరెస్ట్‌కు కారణం అదేనా..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 14 , 2024 | 01:43 PM