TG News: కారుతో ఢీకొట్టి.. ఆపై కత్తితో దాడి చేసి.. హైదరాబాద్‌లో దారుణం
ABN , Publish Date - Dec 02 , 2024 | 11:59 AM
Telangana: 15 రోజుల క్రితమే కానిస్టేబుల్ నాగమణి కులాంతర ప్రేమ వివాహం చేసుకుంది. ఈరోజు ఉదయం విధులు నిర్వర్తించేందుకు హయత్‌నగర్‌కు బయలుదేరగా.. వారి స్వగ్రామం రాయపోలు సమీపంలో హత్యకు గురైంది. నాగమణిని కారుతో ఢీ కొట్టి కత్తితో దాడి చేయడంతో... నాగమణి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
హైదరాబాద్, డిసెంబర్ 2: నగరంలోని ఇబ్రహీంపట్నంలో మహిళా కానిస్టేబుల్ హత్య తీవ్ర కలకలం రేపుతోంది. హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగమణిని సొంత తమ్ముడే అతికిరాతకంగా నరికి చంపేశాడు. సమాచారం అందిన వెంటన పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అక్కడ కొడవలిని సీజ్ చేశారు. కాగా.. గత 15 రోజుల క్రితమే కానిస్టేబుల్ నాగమణి కులాంతర ప్రేమ వివాహం చేసుకుంది. ఈరోజు ఉదయం విధులు నిర్వర్తించేందుకు హయత్‌నగర్‌కు బయలుదేరగా.. వారి స్వగ్రామం రాయపోలు సమీపంలో హత్యకు గురైంది. నాగమణిని కారుతో ఢీ కొట్టి కత్తితో దాడి చేయడంతో... నాగమణి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. నాగమణిని తమ్ముడు పరమేష్ అత్యంత దారుణంగా హత్య చేశాడు.అయితే ఆస్తి కోసమే అక్కను తమ్ముడు పరమేష్ చంపినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ప్రస్తుతం నిందతుడు పరమేష్ పోలీసుల అదుపులో ఉన్నాడు.
రూ. 13 లక్షలకే 9 కోట్ల రోల్స్ రాయిస్ కార్.. ఎలాగంటే..
శ్రీకాంత్ అనే వ్యక్తితో నాగమణి ప్రేమ వివాహం జరిగింది. నవంబర్ ఒకటో తేదీన యాదగిరిగుట్టలో ఈ జంగ వివాహం చేసుకుంది. 2020 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ నాగమణి.. రాయపోల్ ప్రాంతానికి చెందిన శ్రీకాంత్‌ను వివాహం చేసుకుంది. వివాహం అనంతరం హయత్‌నగర్‌లో దంపతులు నివాసం ఉంటున్నారు. నిన్న సెలవు కావడంతో నాగమణి సొంత గ్రామానికి వెళ్ళింది. తిరిగి ఈరోజు విధులకు వెళ్తున్న క్రమంలో తమ్ముడు పరమేష్ ఆమెను వెంబడించాడు. మొదట కార్‌తో ఢీ కొట్టి అనంతరం కొడవలితో మెడ నరికి చంపాడు. హత్య చేసిన పరమేష్‌ను పోలీసులు అదుపులోకి విచారిస్తున్నారు.
వంట మనిషి కోసం రెజ్యూమ్.. క్యూ కడుతున్న జాబ్ ఆఫర్లు..
అనుకున్నట్టే నా భార్యను చంపేశారు: శ్రీకాంత్
చనిపోయిన నాగమణి భర్త శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘8 సంవత్సరాలుగా నాకు నాగమణికి మధ్య ప్రేమ. మా ప్రేమ విషయం తెలిసి ఇంట్లో వాళ్ళు నాగమణి పట్టించుకోవడం మానేశారు. 2021లో ఆమెకు కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. అంతకుముందు నాలుగు సంవత్సరాలు తన హాస్టల్‌లోనే ఉండింది. ఆ సమయంలో తానే ఆమెకు కావలసిన అవసరాలు తీర్చి చదివించాను. కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాక తల్లిదండ్రులు ఆమెకు దగ్గరయ్యారు. నవంబర్ 10వ తేదీన యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నాము. పెళ్లి చేసుకున్న వెంటనే పోలీస్ స్టేషన్‌లో తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశాం. మేము పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మమ్మల్ని చంపుతామని కుటుంబ సభ్యుల బెదిరిస్తూ వచ్చారు. ఈరోజు అనుకున్నట్టే నా భార్యను వాళ్ల తమ్ముడు చంపేశాడు. రాయపోల్ నుండి హయత్‌నగర్ బయలుదేరే ముందు నాకు ఫోన్ చేసింది. మా తమ్ముడు నన్ను చంపేస్తున్నాడు అంటూ ఆ తరువాత ఫోన్ కట్ చేసింది. వెంటనే మా అన్నయ్యకు విషయం చేరవేశాను.. ఆయన వెళ్లే లోపే రక్తపు మడుగులో నాగమణి కొట్టుకుంటుంది’’ అంటూ శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి...
తుపాకీతో కాల్చుకుని ఎస్ ఆత్మహత్య
ఒడిదొడుకుల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇవే టాప్ 5 స్టాక్స్
Read Latest Telangana News And Telugu News