KCR: ఆ విషయంలో అంబేద్కర్ దార్శనికత మహోన్నతం
ABN , Publish Date - Dec 06 , 2024 | 11:08 AM
Telangana: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా దేశానికి వారందించిన సేవలను, అనితర సాధ్యమైన కృషిని కేసీఆర్ స్మరించుకున్నారు. దేశ స్వాతంత్ర్య అనంతరకాలంలో ప్రపంచానికే ఆదర్శవంతమైన స్వయంపాలన కోసం రాజ్యాంగాన్ని అందించారని ఆయన తెలిపారు.
హైదరాబాద్, డిసెంబర్ 6: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (BR Ambedkar) వర్ధంతి సందర్భంగా బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (Former CM KCR) ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ దేశానికి అందించిన సేవలను కొనియాడుతూ శుక్రవారం కేసీఆర్ ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు. సమ సమాజ నిర్మాణ దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. వివక్షకు వ్యతిరేకంగా తన జీవితకాలం పోరాడిన అంబేద్కర్ అజరామర కీర్తిని ప్రపంచానికి చాటేందుకు నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని.. అనేక విప్లవాత్మక కార్యక్రమాలను అమలు చేసిందని చెప్పుకొచ్చారు.
సామాన్యులకు షాకింగ్.. రెపో రేటుపై ఆర్బీఐ కీలక నిర్ణయం...
తెలంగాణ ఏర్పాటుకు మార్గం...
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా దేశానికి వారందించిన సేవలను, అనితర సాధ్యమైన కృషిని కేసీఆర్ స్మరించుకున్నారు. దేశ స్వాతంత్ర్య అనంతరకాలంలో ప్రపంచానికే ఆదర్శవంతమైన స్వయంపాలన కోసం రాజ్యాంగాన్ని అందించారని తెలిపారు. ఆర్థిక సామాజిక రాజకీయ సాంస్కృతిక తదితర రంగాల్లో అణగారిన వర్గాలకు సమాన వాటా సమన్యాయం దక్కేలా రాజ్యాంగాన్ని పొందుపరచడంలో బాబాసాహెబ్ కనబరిచిన దార్శనికత మహోన్నతమైనదని కొనియాడారు. దేశంలో రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పొందుపరిచిన ఆర్టికల్ 3, ఈ దిశగా వారి దార్శనికత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం చూపిందని గుర్తు చేశారు.
అత్యంత ఎత్తులో విగ్రహం..
అంబేద్కర్ విశేష కృషిని, ఆయన అందించిన స్ఫూర్తిని చాటేందుకు ప్రపంచంలోనే అత్యంత మహోన్నతమైన రీతిలో అంబేద్కర్ స్ఫురద్రూపాన్ని తెలంగాణాలో అత్యంత ఎత్తయిన విగ్రహంగా నిలుపుకున్నామన్నారు. దేశ పాలనకు తన రాజ్యాంగం ద్వారా బాటలు వేసిన అంబేద్కర్ ఘనమైన కీర్తిని చాటేందుకు దేశ చరిత్రలోనే మునుపెన్నడూ లేనివిధంగా తెలంగాణ పాలనా భవనానికి "డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్" అని పేరు పెట్టుకున్నామని తెలిపారు.
అంబేద్కర్ స్ఫూర్తితోనే..
అంటరాని వర్గాలుగా తరతరాలుగా వివక్షకు గురవుతున్న దళిత సమాజాన్ని ఆర్థికంగా బలోపేతం చేసి వారి సామాజిక గౌరవం ఇనుమడింప చేసే దిశగా, అంబేద్కర్ స్ఫూర్తితోనే నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం దళిత బంధు పథకం అమలు చేసిందన్నారు. దళిత జీవితాల్లో వెలుగులు నింపే దిశగా దళితబంధు సత్ఫలితాలు సాధించిందని తెలిపారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ అన్ని రంగాల్లో వివక్ష లేని సమసమాజ నిర్మాణానికి అవసరమైన కృషి చేయడం ద్వారానే, అంబేద్కర్ మహనీయునికి ఘన నివాళి అర్పించగలమని కేసీఆర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
భవిష్యత్తులో ఆ దేశం అంతరించిపోతుంది.. ఎలాన్ మస్క్ హెచ్చరిక
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు..
Read Latest Telangana News And Telugu News