Kavitha: ఇది ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనం..
ABN , Publish Date - Dec 11 , 2024 | 03:32 PM
Telangana: ప్రతి రోజు రాష్ట్రంలో ఏదో ఒక చోట ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులు ఆసుపత్రుల పాలవ్వడంతో, సంక్షేమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల్లో వారి పిల్లల క్షేమం పట్ల భయాందోళన నెలకొందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. కనీసం పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించకపోవడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనంగా మారిందని విమర్శించారు.
హైదరాబాద్, డిసెంబర్ 11: జగిత్యాల జిల్లా సారంగాపూర్ కస్తూర్బా బాలికల పాఠశాలలో విద్యార్థినిల అస్వస్థతపై ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) స్పందిస్తూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. జగిత్యాల జిల్లా సారంగాపూర్ కస్తూర్బా బాలికల పాఠశాలలో ఆరుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారనే వార్త ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రతి రోజు రాష్ట్రంలో ఏదో ఒక చోట ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులు ఆసుపత్రుల పాలవ్వడంతో, సంక్షేమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల్లో వారి పిల్లల క్షేమం పట్ల భయాందోళన నెలకొందన్నారు. కనీసం పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించకపోవడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనంగా మారిందని విమర్శించారు.
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో రెచ్చిపోయిన మావోయిస్టులు
విద్యా శాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి , ఏడాది కాలంలో ఒక్కసారి కూడా సంక్షేమ పాఠశాలలకు వెళ్లి అక్కడి పరిస్థితులను, విద్యార్థుల సమస్యలను తెలుసుకోలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే సంక్షేమ పాఠశాలలను సందర్శించాలని డిమాండ్ చేశారు. వాటి పరిస్థితులపై సమీక్ష చేసి ఇలాంటి పరిస్థితుల్లో పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ కవిత ఎక్స్‌లో పోస్టు చేశారు.
చెరిపేస్తే చెరగనివి కేసీఆర్ ఆనవాళ్లు: కేటీఆర్
మరోవైపు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ సాధించిన అద్భుత ఫలితాలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. వ్యవసాయం,సాగునీటి రంగాల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించిన ఘనతకు ఆర్బీఐ తాజా గణాంకాలే నిదర్శనమని పేర్కొన్నారు. చెరిపేస్తే చెరగనివి కేసీఆర్ ఆనవాళ్లు అంటూ పేర్కొన్నారు.
కేటీఆర్ ట్వీట్...
వ్యవసాయాన్ని పండుగ చేయడమంటే ఇదీ!
సాగును సంబురం చేయడమంటే ఇదీ!
దాచేస్తే దాగని సత్యాలు ఇవి!
తొమ్మిదున్నర ఏండ్ల కాలంలో తెలంగాణ సాధించిన అద్భుతాలివి!
2013-14 నుంచి 2022-23మధ్య కాలంలో వ్యవసాయం,సాగునీటి రంగాల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించిన ఘనతకు ఆర్బీఐ తాజా గణాంకాలే నిదర్శనం!
తెలంగాణలో సాగునీటి సదుపాయం(రెండు పంటలు);
2013-14 – 78 లక్షల 18 వేల ఎకరాలు
2022-23 - కోటీ 60 లక్షల ఎకరాలు
తెలంగాణలో పంటల సాగు (రెండు పంటలు) ;
2013-14 - కోటీ 55 లక్షల ఎకరాలు
2022-23 - 2 కోట్ల 29 లక్షల ఎకరాలు
ఆహార పంటల ఉత్పత్తి;
2013-14 - 2 కోట్ల 25లక్షల టన్నులు
2023-24 - 5 కోట్ల టన్నులు
24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా....మిషన్ కాకతీయ ..కాళేశ్వరం..రైతుబంధు సహాఅనేక వ్యవసాయ అనుకూల విధానాల ఫలితాలు ఇవి! చెరిపేస్తే చెరగని కేసీఆర్ ఆనవాళ్లు ఇవి! అంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ పోస్టు చేశారు.
ఇవి కూడా చదవండి...
Kadapa: రాఘవరెడ్డి విచారణ.. ఎంపీ అవినాష్ మెడకు బిగుస్తున్న ఉచ్చు
సంచలన విషయాలు బయటపెట్టిన మనోజ్..
Read Latest Telangana News And Telugu News