Share News

BRS: రేవంత్‌ సర్కార్‌పై మరో ప్లాన్‌కు సిద్ధమైన బీఆర్‌ఎస్

ABN , Publish Date - Dec 16 , 2024 | 02:51 PM

Telangana: తెలంగాణ ప్రభుత్వంపై సభా హక్కుల నోటీసు ఇచ్చేందుకు బీఆర్‌ఎస్ పార్టీ సిద్ధమైంది. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను గులాబీ పార్టీ ఎమ్మెల్యే కలిసి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాసనసభలో ప్రివిలేజ్ మోషన్ పెట్టాలని కోరారు.

BRS: రేవంత్‌ సర్కార్‌పై మరో ప్లాన్‌కు సిద్ధమైన బీఆర్‌ఎస్
BRS Party

హైదరాబాద్, డిసెంబర్ 16: రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాసనసభలో ప్రివిలేజ్ మోషన్ పెట్టాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను (Telangana Speaker Gaddam Prasad) బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కోరారు. తెలంగాణ శాసనసభ కార్య విధాన, కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని 168 (1) నిబంధన ప్రకారం బీఆర్‌ఎస్ శాసనసభాపక్షం తరఫున ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్కపై (Deputy CM Bhatti Vikramarka) సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నట్లు బీఆర్‌ఎస్ తెలిపారు. తెలంగాణ అప్పులపైన శాసనసభను, తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించిన ప్రభుత్వంపైన ప్రివిలేజ్ మోషన్‌కు అనుమతి ఇవ్వాలని గులాబీ పార్టీ కోరింది.

Hyderabad: సినిమా షూటింగ్‌లో గాయపడ్డ రెబల్ స్టార్ ప్రభాస్..


ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. ఆర్‌బీఆర్‌ఐ నివేదికలో తెలంగాణ అప్పులు కేవలం 3.89 లక్షల కోట్లు అని స్పష్టం చేస్తే ప్రభుత్వం మాత్రం 7 లక్షల కోట్ల అప్పులు అంటూ తప్పుదోవ పట్టించినందున సభాహక్కులు నోటీలు ఇస్తున్నట్లు బీఆర్‌ఎస్ వెల్లడించింది. అప్పులపై ఆర్ధిక మంత్రి ప్రసంగం పూర్తిగా అవాస్తవమని ఇటీవలే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ''హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్'' పేరుతో విడుదల చేసిన నివేదిక నిరూపించిందన్నారు. 2014-15లో తెలంగాణ మొత్తం రుణాలు రూ.72 వేల 658 కోట్లు ఉండగా, 2024 మార్చి నాటికి ఈ రుణాల మొత్తం రూపాయలు రూ. 3,89, 673 కోట్లకు చేరిందని ఆర్‌బీఐ వెల్లడించిందన్నారు.

శ్రీవారి భక్తులకు అలర్ట్..


అప్పులపై ఆర్ధిక మంత్రి ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారన్నారు. తెలంగాణ శాసనసభ కార్య విధాన, కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని 168 (1) నిబంధన ప్రకారం బీఆర్‌ఎస్ శాసనసభా పక్షం తరపున ఆర్ధిక మంత్రిపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నామని గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

Drugs Racket : అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు... భారీగా డ్రగ్స్ స్వాధీనం

BRS: కేసీఆర్ ఆనవాళ్లను చేరిపేయడం నీ తరం కాదు..: కేటీఆర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 16 , 2024 | 02:55 PM