Share News

Hyderabad: అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు స్నేహితుడిని దారుణంగా..

ABN , Publish Date - Dec 03 , 2024 | 03:31 PM

Telangana: భాగ్యలత అరుణోదయ కాలనీలో నివసించే కాశీరావును మిత్రుడు శేఖర్ గొంతుకోసి హత్య చేశాడు. స్విగ్గి డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న శేఖర్‌కు కాశీరావు నాలుగు లక్షలు అప్పుగా ఇచ్చాడు. అప్పు తిరిగి ఇవ్వమని శేఖర్ ఫ్లాట్‌కు కాశీరావు వెళ్లాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వివాదం చోటు చేసుకుంది. దీంతో తీవ్ర కోపంతో ఊగిపోయిన శేఖర్.. కాశీరావు గొంతుకోసి అక్కడి నుంచి పరారయ్యాడు.

Hyderabad:  అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు స్నేహితుడిని దారుణంగా..
Businessman brutally murdered in Hyderabad Telangana

హైదరాబాద్‌, డిసెంబర్ 3: నగరంలో (Hyderabad) దారుణం జరిగింది. హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ వ్యాపారవేత్త దారుణ హత్యకు గురయ్యాడు. భాగ్యలత అరుణోదయ కాలనీలో నివసించే కాశీరావును మిత్రుడు శేఖర్ గొంతుకోసి హత్య చేశాడు. స్విగ్గి డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న శేఖర్‌కు కాశీరావు నాలుగు లక్షలు అప్పుగా ఇచ్చాడు. అప్పు తిరిగి ఇవ్వమని శేఖర్ ఫ్లాట్‌కు కాశీరావు వెళ్లాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వివాదం చోటు చేసుకుంది. దీంతో తీవ్ర కోపంతో ఊగిపోయిన శేఖర్.. కాశీరావు గొంతుకోసి అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే డబ్బు విషయంలో హత్య జరిగిందా లేక మరేదైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

BRS: కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఆసక్తికర కామెంట్స్


విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్లూ సేకరించే పనిలో పడ్డారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. హత్య అనంతరం శేఖర్ పరారవ్వగా.. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.


స్విగ్గీ డెలివరీ బాయ్‌గా ఉన్న శేఖర్‌‌కు కాశీరావు మధ్య గకొంత కాలంగా స్నేహం ఉంది. ఈ స్నేహంలో భాగంగా శేఖర్‌కు కాశీరావు నాలుగు లక్షలు అప్పుగా ఇచ్చాడు. ఈ అప్పు విషయంలో పలుమార్లు ఇవురురి మధ్య వాగ్వివాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వాలని ఈరోజు శేఖర్ ఉంటున్న ఫ్లాట్‌కు కాశీరావు వెళ్లాడు. అదే సమయంలో తనకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వాలంటూ కాశీరావు పట్టుబడ్డాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో కత్తితో కాశీరావు మెడపై శేఖర్ కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన కాశీరావు అక్కడిక్కడే మృతిచెందాడు.


కాశీరావు చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత శేఖర్ పరారయ్యాడు. అయితే శేఖర్ బయటకు వెళ్తున్న క్రమంలో అతడిపై రక్తపుమరకలు ఉండటాన్ని కాశీరావు భార్య గుర్తించింది. వెంటనే కిందకు వచ్చి చూడగా అప్పటికే కాశీరావు రక్తపుమడుగులో కొట్టిమిట్టాడుతున్నాడు. ఆ వెంటనే కాశీరావు భార్య.. పోలీసులు, స్థానికులకు సమాచారం అందించింది. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్లూ సేకరించి.. డెడ్‌బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న శేఖర్‌ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ హత్యకు ఆర్థిక విబేధాలే కారణమా.. లేక మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.


ఇవి కూడా చదవండి..

మాజీ ఎమ్మె ల్యే ద్వారంపూడికి మరో షాక్

టీడీపీలోకి వైసీపీ ముఖ్య నేత.. ఎవరంటే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 03 , 2024 | 03:31 PM