Share News

Allu Arjun Arrest: అర్జున్ అరెస్ట్‌పై సీఎం రేవంత్ ఏమన్నారంటే

ABN , Publish Date - Dec 13 , 2024 | 03:12 PM

Telangana: అల్లు అర్జున్ అరెస్ట్‌పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ‘‘ఇందులో నా జోక్యం ఏమీ ఉండదు’’ అని స్పష్టం చేశారు. చట్టం ముందు అందరూ సమానులే అని.. చట్టపరమైన ప్రక్రియ జరుగుతుందని సీఎం తెలిపారు.

Allu Arjun Arrest: అర్జున్ అరెస్ట్‌పై సీఎం రేవంత్ ఏమన్నారంటే
CM Revanth Reddy

హైదరాబాద్, డిసెంబర్ 13: ప్రముఖ హీరో అల్లు అర్జున్ (Hero Allu Arjun) అరెస్ట్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. ఢిల్లీలో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో సీఎం మాట్లాడుతూ.. అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ‘‘ఇందులో నా జోక్యం ఏమీ ఉండదు’’ అని స్పష్టం చేశారు. చట్టం ముందు అందరూ సమానులే అని.. చట్టపరమైన ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. తొక్కిసలాటలో ఒకరు చనిపోయిన నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. అలాగే నటుడు మోహన్ బాబు విషయంలో కోర్టు ఉత్తర్వులున్నాయన్నారు.

బన్నీ అరెస్ట్‌.. సీపీ సీవీ ఆనంద్ రియాక్షన్


అలాగే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణమై సీఎం మాట్లాడుతూ.. క్యాబినెట్ విస్తరణపై ఎలాంటి చర్చ లేదన్నారు. ఓవైపు సీరియస్‌గా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇంకో వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయన్నారు. క్యాబినెట్ విస్తరణ జరగాలంటే పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం, ముఖ్యనేతలతో చర్చలు జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.


అల్లు అర్జున్ తప్పు లేదు: రాజాసింగ్

raja-singh.jpg

మరోవైపు అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రముఖులు స్పందించారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఈ విషాదకరమైన తొక్కిసలాట ఘటన పోలీసు శాఖ వైఫల్యమే తప్ప, తన ప్రశంసలు, విజయాలతో తెలుగు రాష్ట్రాలకు ఎనలేని గర్వాన్ని తెచ్చిపెట్టిన జాతీయ అవార్డు గ్రహీత స్టార్ అల్లుఅర్జున్ తప్పు కాదన్నారు. అతను నేరుగా బాధ్యత వహించని దానికి అతనిని జవాబుదారీగా ఉంచడం అన్యాయం , అసమంజసమైనదననారు. క్రౌడ్ మేనేజ్‌మెంట్‌లోని దైహిక సమస్యలు, లోపాలను పరిష్కరించడానికి బదులుగా, ప్రముఖ చిహ్నాన్ని లక్ష్యంగా చేసుకోవడం పరిపాలనపై చెడుగా ప్రతిబింబిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. జవాబుదారీతనం నిజంగా ఎక్కడ ఉందో - ప్రజా భద్రతను కాపాడే బాధ్యత కలిగిన వారితో నిర్ధారించుకోవాలని హితవుపలికారు. అల్లు అర్జున్ తన రచనలకు గౌరవం ఇవ్వాలని.. నేరస్థుడికి తగిన చికిత్స కాదని ఎమ్మెల్యే రాజాసింగ్ అభిప్రాయపడ్డారు.


కాగా.. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన కేసులో హీరో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 4న పుష్ప 2 ప్రిమియర్ షో విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృత్యువాత పడింది. ఈ ఘటనపై రేవతి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం అల్లు అర్జున్ నివాసానికి వెళ్లిన చిక్కడపల్లి పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. వైద్యపరీక్షలు పూర్తి అయిన అనంతరం నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్‌‌ను తీసుకొచ్చారు. కాసేపట్లో అల్లు అర్జున్‌ను మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చనున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్‌ విషయంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.


ఇవి కూడా చదవండి...

అల్లు అర్జున్ అరెస్ట్.. నెక్ట్స్ జరిగేదిదే..

Pawankalyan: బాబును ఎన్నిసార్లు మెచ్చుకున్నా తక్కువే

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 13 , 2024 | 03:26 PM