Share News

Congress: తెలంగాణ తల్లిని టచ్ చేసే అవకాశం మీకు ఉండదు

ABN , Publish Date - Dec 10 , 2024 | 01:24 PM

Telangana: అధికారికంగా చట్టబద్ధంగా రూపొందిన విగ్రహం తెలంగాణ ఉద్యమకారులకు ప్రతీక అని.. అలాంటి విగ్రహాన్ని ఎట్లా తరలిస్తారని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. ‘‘మీరు టచ్ చేసే అవకాశం తెలంగాణ ప్రజలు మళ్ళీ మీకు ఇవ్వరు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్, కవిత రాజకీయంగా ఎంతకైనా దిగజారుతారని విమర్శించారు. పది ఏండ్లు అధికారంలోకి ఉండి తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.

Congress: తెలంగాణ తల్లిని టచ్ చేసే అవకాశం మీకు ఉండదు
MLA Yennam Srinivas Reddy

హైదరాబాద్, డిసెంబర్ 10: అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అసెంబ్లీకి వచ్చి కేసీఆర్ సలహాలు ఇవ్వాలని ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి (MLA Yennam Srinivas Reddy) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎల్‌ఓపీ మీకు పూచిక పుల్లతో సమానం అనుకుంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ‘‘ మీ అల్లుడికి లేదా కొడుకుకి ఎల్‌వోపీ ఇవ్వండి. కవిత ఏ ఉద్యమకారులని గౌరవించిందో చెప్పాలి. కేసీఆర్‌కు సిగ్గులేదు, నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్‌లో చేరను అని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నడు. మీరు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ భవన్‌లో రూపొందలేదా అని ప్రశ్నించారు.

AP Govt: రాజధాని అమరావతి పనులపై సర్కార్ కీలక ప్రకటన


అధికారికంగా చట్టబద్ధంగా రూపొందిన విగ్రహం తెలంగాణ ఉద్యమకారులకు ప్రతీక అని.. అలాంటి విగ్రహాన్ని ఎట్లా తరలిస్తారని ప్రశ్నించారు. ‘‘మీరు టచ్ చేసే అవకాశం తెలంగాణ ప్రజలు మళ్ళీ మీకు ఇవ్వరు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్, కవిత రాజకీయంగా ఎంతకైనా దిగజారుతారని విమర్శించారు. పది ఏండ్లు అధికారంలోకి ఉండి తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. కేటీఆర్, కవితలు అమెరికా నుంచి వచ్చినప్పుడు ఆస్తి ఎంత? ఇప్పుడు మీ ఆస్తి ఎంతో చెప్పాలని నిలదీశారు. కేటీఆర్, కవిత తెలంగాణ ఉద్యమ సమయంలో వర్కౌట్ అయితదని అమెరికా నుంచి ఇక్కడికి వచ్చారన్నారు.

రాంగోపాల్‌ వర్మకు గుడ్‌ న్యూస్


కవిత అధికారానికి అడ్డుగా వస్తారని మహిళా మంత్రిగా లేకుండా చేశారన్నారు. శ్రామిక జీవన సౌందర్యానికి ప్రతి రూపమే నేటి తెలంగాణ తల్లి అని చెప్పుకొచ్చారు. చాకలి ఐలమ్మ ప్రతి రూపమేనని సంబండ వర్గాలు అభిప్రాయపడుతున్నారన్నారు. గద్దర్, గూడ అంజన్న, విమలక్క, అశోక్ తేజ, జయరాజ్‌లను బీఆర్‌ఎస్ ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించారు. గోరేటి వెంకన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయినా సరే కవిగా ఆయనను సన్మానించామన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ఉద్యమ కారులకు మేనిఫెస్టోలో పెట్టిన హామీలను కాంగ్రెస్ అమలు చేస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఎవరికైనా ఉంటది కానీ కల్వకుంట్ల కుటుంబానికి లేదని ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

మాతో పెట్టుకుంటే దబిడి దిబిడే.. వాళ్లకు కవిత మాస్

ఫైనల్‌గా విష్ణు కుటుంబం అక్కడే స్థిరపడుతుందా...

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 10 , 2024 | 01:25 PM