Telangana Thalli: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ.. అలరించనున్న సాంస్కృతిక కార్యక్రమాలు
ABN , Publish Date - Dec 09 , 2024 | 09:35 AM
Telangana: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అలాగే పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
హైదరాబాద్, డిసెంబర్ 9: రాష్ట్ర సచివాలయంలో నేడు(సోమవారం) తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ (Telangana Thalli Statue) జరుగనుంది. ప్రజాపాల విజయోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. విగ్రహావిష్కరణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పలు సాంస్కృతి కార్యక్రమాలను ఏర్పాటు చేసింది సర్కార్. సంగీత కచేరీలతో పాటు, కళాకారులు తబ ఆటపాటలతో అందరినీ అలంరింనున్నారు. ఈరోజు సాయంత్రం విగ్రహావిష్కరణ జరుగనుండగా.. అనంతరం బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసగించనున్నారు.
Manchu Family: మంచు మనోజ్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్న పోలీసులు..
ప్రజాపాలన విజయోత్సవాల్లో నేటి కార్యక్రమాలు
సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డితో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ
సాయంత్రం 5 నుంచి 5.45 వరకు బహిరంగ సభ
సచివాలయంలో 5.45 గంటల నుంచి 6 గంటల వరకు డ్రోన్ షో.
సచివాలయంలో 6.05 గంటల నుంచి 6.20 గంటల వరకు బాణాసంచాలు పేల్చడం
అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కల్చరల్ వేదికలో థమన్ మ్యూజికల్ నైట్ వద్దకు చేరుకుంటారు 6.10 గంటలకుసాంస్కృతిక కార్యక్రమాలు.
నెక్లెస్ రోడ్ సాంస్కృతిక కార్యక్రమాల కోసం మూడు వేదికలు ఏర్పాటు చేశారు.
సంగీత కచేరీ - ఎస్ తమన్‌తో 7 గంటల నుంచి 8.30 గంటల వరకు హెచ్ ఎం డీ ఏ గ్రౌండ్స్ ఇమాక్స్.
సాంస్కృతిక కార్యక్రమాలు 5 నుంచి 9 గంటల వరకు
ఫుడ్ స్టాల్స్, హ్యాండీక్రాఫ్ట్ స్టాల్స్, కల్చరల్ స్టాల్స్ ఉదయం నుంచి రాత్రి వరకు.
సాంస్కృతిక కార్యక్రమాల వివరాలు
కళాకారులు - వడే శంకర్ పాటలు 5.00 - 6.00 వరకు (వేదిక – రాజీవ్ విగ్రహం)
ఒడిస్సీ - సుదీప్త పాండా అండ్ టీమ్ - 6.00 - 7.00 (వేదిక – రాజీవ్ విగ్రహం)
ఫ్యూజన్ - అర్థా వర్షిణి అండ్ టీమ్ - 7.00 - 7.45 (వేదిక – రాజీవ్ విగ్రహం)
మాజిక్ - జనార్ధన్ కేసమోని 7.45 – 8.30 (వేదిక – రాజీవ్ విగ్రహం)
ఒగ్గు డోలు విన్యాసం - ఎం.అశోక్ అండ్ టీమ్ - 8.30 - 9.00 (వేదిక – రాజీవ్ విగ్రహం)
ఇవి కూడా చదవండి...
రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన చరిత్ర బీఆర్‌ఎ్‌సదే
ఎస్సై ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. వీడియో విడుదల.
Read Latest Telangana News And Telugu News