Hyderabad: కేంద్ర మంత్రితో దామోదర వర్చువల్ మీట్.. సీజనల్ వ్యాధులపై చర్చ
ABN , Publish Date - Aug 10 , 2024 | 04:02 PM
అసలే వర్షాకాలం కావడంతో రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. వ్యాధుల నివారణపై చర్చించడానికి కేంద్ర మంత్రితో రాష్ట్ర మంత్రి వర్చువల్‌గా సమావేశం అయ్యారు.
హైదరాబాద్: అసలే వర్షాకాలం కావడంతో రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. వ్యాధుల నివారణపై చర్చించడానికి కేంద్ర మంత్రితో రాష్ట్ర మంత్రి వర్చువల్‌గా సమావేశం అయ్యారు. ఫైలేరియా, నులిపురుగుల నిర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ(Damodar Raja Narasimha) పేర్కొన్నారు.
జాతీయ ఫైలేరియా, నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ అధ్యక్షతన నిర్వహించిన వర్చువల్ కార్యక్రమంలో దామోదర్ శనివారం పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని అంబేడ్కర్ సచివాలయంలోని తన కార్యాలయం నుంచి దామోదర్ ఇందులో పాల్గొన్నారు. ఫైలేరియా, నులిపురుగుల నిర్మూలన కోసం సంగారెడ్డి, మహబూబాబాద్ జిల్లాలలో 14 ఆరోగ్య కేంద్రాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ప్రాథమిక కేంద్రాల ఏర్పాటు..
తెలంగాణలో ఫైలేరియా, నులిపురుగుల నివారణకు చేపడుతున్న చర్యలను దామోదర్.. కేంద్రమంత్రికి వివరించారు. సంగారెడ్డి, మహబూబాబాద్ జిల్లాలో 14 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని ప్రజలకు బోదకాలు వ్యాధి, నులిపురుగుల నివారణకు ఆగస్టు 10 నుంచి మందులుపంపిణీ చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ఇందుకుగానూ 2,600 మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చి ఇందులో భాగస్వామ్యం చేశామన్నారు. అలాగే 2,522 మంది డ్రగ్ అడ్మినిస్ట్రేటర్లు క్షేత్రస్థాయిలో సేవలందిస్తారని మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా ఫైలేరియా, నులిపురుగుల నివారణకు చేపడుతున్న కార్యక్రమాలపై అవగాహనపత్రాలను, బ్రోచర్లను ఆయన ఆవిష్కరించారు. తెలంగాణను ఫైలేరియా నిర్మూలన రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. వర్చువల్‌గా జరిగిన ఈ కార్యక్రమంలో బిహార్, జార్ఖండ్, కర్ణాటక, ఒడిశా, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు పాల్గొనగా.. తెలంగాణ నుంచి ప్రభుత్వ కార్యదర్శి డా. క్రిస్టినా ఉన్నారు.
ఇవి కూడా చదవండి...
BSNL: బీఎస్ఎన్ఎల్ బంపరాఫర్.. జియో, ఎయిర్‌టెల్‌కు చుక్కలే..
TG News: ఇన్‌స్టా గ్రామ్ పరిచయమే శాపంగా మారి ఆ యువతిని...
Read Latest Telangana News And Telugu News