LakshmaReddy: అక్రమాల్లో నాకు సంబంధం లేదు
ABN , Publish Date - Jun 15 , 2024 | 03:25 AM
గొర్రెల కొనుగోలు అక్రమాల్లో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ పశు సంవర్ధకశాఖ డైరక్టర్ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఏ విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నానని, విచారణకు పిలిస్తే సహకరిస్తానని అన్నారు. కానీ ఇప్పటి వరకు ఈ విషయంపై తనకు ఎలాంటి నోటీసులూ అందలేదని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.
విచారణకు సిద్ధం.. ఏ నోటీసులూ రాలేదు
మాజీ పశు సంవర్ధకశాఖ డైరక్టర్ లక్ష్మారెడ్డి
హైదరాబాద్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): గొర్రెల కొనుగోలు అక్రమాల్లో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ పశు సంవర్ధకశాఖ డైరక్టర్ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఏ విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నానని, విచారణకు పిలిస్తే సహకరిస్తానని అన్నారు. కానీ ఇప్పటి వరకు ఈ విషయంపై తనకు ఎలాంటి నోటీసులూ అందలేదని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. 2020లో పశు సంవర్ధకశాఖ డైరక్టర్, గొర్రెల, మేకల అభివృద్ధి సహకార సంస్థకు మేనేజింగ్ డైరక్టర్గా సేవలందించానని, ఆ తరువాత పదవీ విరమణ పొందానని పేర్కొన్నారు. పదవీ విరమణ పొందినప్పటి నుంచి శాఖతో ప్రత్యక్షంగా, పరోక్షంగా తనకు ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. వేసవి సెలవుల నేపథ్యంలోనే కెనడాలో ఉన్న తన కుమారుడి వద్దకు వెళ్లినట్లు, త్వరలోనే భారత్కు తిరిగి రానున్నట్లు తెలిపారు. నిబంధనల మేరకే తాను విధులను నిర్వర్తించానని లక్ష్మారెడ్డి లేఖలో పేర్కొన్నారు.
నిందితులపై చర్యలు తీసుకోవాలి: నిరంజన్
గొర్రెల కుంభకోణం నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారు దేశం విడిచి వెళ్లకుండా చూడాల ని ప్రభుత్వాన్ని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ కోరారు. ఆటోలు, ద్విచక్ర వాహనాలు, ఆంబులెన్స్ల్లో గొర్రెలు రవాణా చేశామని పేర్కొన్నారంటే.. పెద్దవాళ్ల ప్రమేయం లేకుండా ఇది జరగదన్నారు.