Share News

Errabelli: బిడ్డా రేవంత్.. బీఆర్‌ఎస్ చెట్టును ఎలా మొలవనివ్వవో చూస్తాం

ABN , Publish Date - Nov 20 , 2024 | 10:29 AM

Telangana: సీఎం సభకు ఇద్దరు మంత్రులు, ఓ ఎమ్మెల్యే హాజరు కాలేదని.. దీంతోనే సీఎం అందరినీ కలుపుకుని పోవడం లేదని అర్థం అవుతోందని ఎర్రబెల్లి అన్నారు. ‘‘రేవంత్ ఓ చీటర్, ఏ బ్రోకర్, ఓ కబ్జాకోరు. రేవంత్ ఒక గంజాయి మొక్క, కేసీఆర్ మర్రిచెట్టు. రేవంత్‌కు ఢీల్లీలో రాహుల్, సోనియా అపాయింట్ దొరకడం లేదు. కాంగ్రెస్ వాళ్లే రేవంత్ పదవి ఊడగొడతారు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

Errabelli: బిడ్డా రేవంత్.. బీఆర్‌ఎస్ చెట్టును ఎలా మొలవనివ్వవో చూస్తాం
Former Minister Errabelli Dayakar Rao

వరంగల్, నవంబర్ 20 : కేసీఆర్ (Former CM KCR) అనే మొక్కను తెలంగాణ గడ్డపై మళ్లీ మొలకెత్తనివ్వబోమని హనుమకొండలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు (Former Minister Errebelli Dayakar Rao) ముఖ్యమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘బిడ్డా రేవంత్... బీఆర్ఎస్ చెట్టును ఎలా మొలవనివ్వవో మేము చూస్తాం’’ అని అన్నారు.

ఏపీ అసెంబ్లీలో వింత పరిస్థితి


సీఎం సభకు ఇద్దరు మంత్రులు, ఓ ఎమ్మెల్యే హాజరు కాలేదని.. దీంతోనే సీఎం అందరినీ కలుపుకుని పోవడం లేదని అర్థం అవుతోందన్నారు. ‘‘రేవంత్ ఓ చీటర్, ఏ బ్రోకర్, ఓ కబ్జాకోరు. రేవంత్ ఒక గంజాయి మొక్క, కేసీఆర్ మర్రిచెట్టు. రేవంత్‌కు ఢీల్లీలో రాహుల్, సోనియా అపాయింట్ దొరకడం లేదు. కాంగ్రెస్ వాళ్లే రేవంత్ పదవి ఊడగొడతారు. సీఎం రేవంత్ రెడ్డి నన్ను రాక్షసుడు అన్నారు... అవును నేను రాక్షసుడ్నే. ప్రజల కోసం పనిచేసే రాక్షసుడిని. వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. నిన్ను సొంత నియోజకవర్గంలో తరిమితే బయటకు వచ్చావు’’ అంటూ దుయ్యబట్టారు.

500 దాటేసిన రాజధాని గాలి కాలుష్యం.. డేంజర్ జోన్‌లో


మహిళలు కోటీశ్వరులు అవ్వడం కాదని...రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులే కోటీశ్వరులు అవుతున్నారన్నారు. ఆరు గ్యారంటీల్లో ఏం అమలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘కాళోజీ కళాక్షేత్రం మేము నిర్మిస్తే... మీరు ఓపెన్ చేశారు’’ అని తెలిపారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో కళాక్షేత్రం నిర్మాణం ఆలస్యం అయిందన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో లేరని.. కాళోజీ గురించి రేవంత్ రెడ్డికి ఏం తెలుసని ప్రశ్నించారు. ‘‘బాబ్లీ ప్రాజెక్టు ఉద్యమంలో మేం తన్నులు తింటే... నువ్వు తప్పించుకున్నావ్. తెలుగుదేశం ఎమ్మెల్యేగా రిజైన్ చేయకుండా కాంగ్రెస్ కు వెళ్లింది రేవంత్ రెడ్డి ఒక్కరే’’ అంటూ ఎర్రబెల్లి దయాకర్ రావు విరుచుకుపడ్డారు.


నిన్ను ఎలా తొక్కాలో మాకు తెలుసు: పల్లా రాజేశ్వర్‌ రెడ్డి

palla-rajeshwar-reddy.jpg

వరంగల్: కేసీఆర్ ఒక మహా వృక్షమని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రతి అభివృద్ధిలో కేసీఆర్ కనిపిస్తారని తెలిపారు. ‘‘కేసీఆర్ నిన్ను నీడలా వెంటాడుతడు. ఇదే వరంగల్ వేదికగా కేసీఆర్‌ను తీసుకొచ్చి నీపై ఉద్యమం మొదలుపెడతామని ఒట్టేసి చెబుతున్నాం. కొడంగల్‌ను ఫార్మా విలేజీని మీ అల్లుడికి అప్పగించావు. అన్నదమ్ములు, వియ్యంకుడితో కుంభకోణాలు చేస్తున్నారు. సీఎం, మంత్రులు బంధిపోట్లలా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. కేసీఆర్ తాగుబోతు కాదు... గ్రామాల్లో గుడుంబా, గంజాయిని అరికట్టండి. ఎక్సైజ్ తప్ప మిగిలిన శాఖల ఆదాయం పడిపోయింది. మేము చేసిన అభివృద్ధిని విధ్వంసం చేస్తున్నారు. కాళోజీ నారాయణరావు ఇందిరమ్మ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలకు నిధులు ఇస్తారేమో అని నిన్నటి సభలో ఆశపడ్డారు. తొక్కడం నేర్పించిన నిన్ను ఎలా తొక్కాలో మాకు తెలుసు. కాంగ్రెస్ నేతలు, ప్రజలను తొక్కుకుంటూ వచ్చావ్’’ అంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.


అంతటి మొగోడివా రేవంత్: మధుసూదనాచారి

madhusudana-chari.jpg

నిన్న కాంగ్రెస్ నిర్వహించిన సభ వంచన సభ అని మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం నిన్న కల్లుతాగిన కోతిలా మాట్లాడారన్నారు. కేసీఆర్‌ను మొలకెత్తకుండా చేసే మొగోడివా రేవంత్ అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఒక వటవృక్షమన్నారు. సభలో మసిబూసి మారేడుకాయ చేశారని విమర్శించారు. మహిళలకు సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి మాటల తీరు హామీలకు ఎగనామం పెట్టేలా ఉందన్నారు. రేవంత్ రెడ్డి ఏడాదిలోనే 85వేల కోట్ల రూపాయలు అప్పు చేశారన్నారు. రేవంత్ పదవి తుమ్మితే ఊడే ముక్కులాంటిదన్నారు. రేవంత్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని.. మంత్రుల మధ్య సమన్వయ లోపించిందన్నారు. నిన్నటి సభనే రేవంత్‌ను గద్దె దింపుతుందని.. రేవంత్ ది నిరంకుశ పాలన అంటూ మధుసూదనాచారి వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి..

బాబోయ్ మళ్లీ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..

ఉడుము పవర్ అంటే ఇదీ..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 20 , 2024 | 11:20 AM