Share News

Harishrao: తెలంగాణ తల్లి విగ్రహమంటూనే ఆశా తల్లులపై దాడి.. ఇదెక్కడి న్యాయం

ABN , Publish Date - Dec 09 , 2024 | 04:18 PM

Telangana: ఒకవైపు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు చేస్తున్నామని గొప్పలు చెబుతూ.. మరో వైపు క్షేత్రస్థాయిలో విశిష్ట సేవలందించే ఆశా తల్లులపై దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆశా వర్కర్ల వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పిస్తామని అభయహస్తం మేనిఫెస్టో పేజీ నెంబర్ 26లో హామీ ఇచ్చారని గుర్తుచేశారు.

Harishrao: తెలంగాణ తల్లి విగ్రహమంటూనే ఆశా తల్లులపై దాడి.. ఇదెక్కడి న్యాయం
Former Minister Harish Rao

హైదరాబాద్, డిసెంబర్ 9: కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి తన మాటల తూటాలు వదిలారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆశా వర్కర్ల సమస్యలపై ఎక్స్‌ వేదికగా హరీష్ స్పందించారు. ఓ వైపు తెలంగాణ తల్లి విగ్రహమంటూనే మరోవైపు ఆశా తల్లులపై దాడి ఏంటని ప్రశ్నించారు. ఆశా వర్కర్ల వేతనం, ఉద్యోగ భద్రతపై ఎన్నికల ముందు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు నివసించే హక్కు లేదా అని ప్రశ్నించారు. ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

అటువైపు వెళ్తున్నారా.. మీరు అడ్డంగా బుక్కైనట్లే


హరీష్ ట్వీట్ ఇదే..

ఒకవైపు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు చేస్తున్నామని గొప్పలు చెబుతూ.. మరో వైపు క్షేత్రస్థాయిలో విశిష్ట సేవలందించే ఆశా తల్లులపై దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆశా వర్కర్ల వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పిస్తామని అభయహస్తం మేనిఫెస్టో పేజీ నెంబర్ 26లో హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు ఆ హామీ అమలు చేయాలంటూ ఆశా అక్కా చెల్లెళ్లు రోడ్డెక్కితే పోలీసులతో ఇష్టారీతిన కొట్టించడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలకు సేవలందించే ఆశా వర్కర్లకు నిరసించే హక్కు లేదా అని.. సమస్యలు పరిష్కరించాలని అడిగే స్వేచ్చ లేదా అని నిలదీశారు. తెలంగాణ ఏర్పాటుకు మందు ఆశాల గౌరవ వేతనం రూ.1500 మాత్రమే ఉంటే, కేసీఆర్ రూ.10 వేలకు పెంచి వారి సేవలను గుర్తించి గౌరవించారని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది గడుస్తున్నా ఇచ్చిన హామీ నెరవేర్చలేదన్నారు. ప్రశ్నిస్తే పోలీసులతో పళ్లూడగొట్టించే దుర్మార్గ వైఖరిని అవలంబిస్తూ, ఆశాల ఆశలపై నీళ్లు చల్లుతుండటం సిగ్గుచేటు అంటూ హరీష్ రావు ఎక్స్‌లో విరుచుకుపడ్డారు.


ఆశావర్కర్ల ఆందోళన.. ఉద్రిక్తం...

కాగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ మేరకు ఆశా వర్కర్లకు18 వేలు ఫిక్స్డ్ సాలరీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కోటి డీఎంఈ వద్ద ఈరోజు (సోమవారం) ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున వచ్చిన ఆశా వర్కర్లు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళన చేస్తున్న ఆశావర్కర్లను అడ్డుకున్నారు. దీంతో అక్కడ తోపులాట చోటు చేసుకోవడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఆశా వర్కర్లకు, పోలీసులకు వాగ్వాదం చోటు చేసుకుంది.


అసలు దీక్షా దివస్ లేకపోతే..

అలాగే డిసెంబర్ 9 ప్రత్యేకతపై మాజీ మంత్రి మరో ట్వీట్ చేశారు. ‘‘గాంధీ, నెహ్రూ సహా ఎంతో మంది స్వాతంత్ర్య సమరయోధులు కొట్లాడితే భారత దేశానికి స్వాంత్ర్యం వచ్చింది అనేది ఎంత నిజమో. కేసీఆర్ నిరాహార దీక్షతో దిగివచ్చిన నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు ప్రకటన డిసెంబర్ 9, 2009న చేయడం అంతే నిజం. నవంబర్ 29 దీక్షా దివస్ లేకపోతే , డిసెంబర్ 9 విజయ్ దివస్ లేదు, ఇవి లేకుండా జూన్ 2 తెలంగాణ జన్మ దివస్ లేదు. జై కేసీఆర్.... జై తెలంగాణ’’ అంటూ ఎక్స్‌లో హరీష్‌రావు పోస్టు చేశారు.


ఇవి కూడా చదవండి...

రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన చరిత్ర బీఆర్‌ఎ్‌సదే

ఎస్సై ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. వీడియో విడుదల.

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 09 , 2024 | 04:19 PM