Share News

Formula E: గవర్నర్ గ్రీన్ సిగ్నల్.. కేటీఆర్‌ అరెస్ట్ తప్పదా

ABN , Publish Date - Dec 13 , 2024 | 04:00 PM

Telangana: ఫార్ములా ఈ రేస్‌ కేసులో కేటీఆర్‌ను విచారించేందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఏసీబీ విచారణను ప్రారంభించనుంది. ముందుగా కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Formula E: గవర్నర్ గ్రీన్ సిగ్నల్.. కేటీఆర్‌ అరెస్ట్ తప్పదా
Governor approves investigation of KTR in Formula E race case

హైదరాబాద్, డిసెంబర్ 13: ఫార్ములా ఈ రేసు కేసులో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను (Former Minister KTR) విచారించేందుకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ (governor jishnu dev varma) గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గవర్నర్‌ నుంచి అనుమతి రావడంతో ఏసీబీ ఇక విచారణను ప్రారంభించనుంది. మొదట కేటీఆర్‌కు నోటీసు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ రేసింగ్‌లో భారీ స్కాం జరిగినట్లు రేవంత్ సర్కార్ గుర్తించింది. నిబంధనలకు విరుద్ధంగా నిధుల చెల్లింపులు జరిగాయని విచారణలో బయటపడింది. రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండానే విదేశీ కంపెనీతో ఒప్పందం, చెల్లింపులు జరిగినట్లు తేలింది.

Allu Arjun Arrest: అర్జున్ అరెస్ట్‌పై సీఎం రేవంత్ ఏమన్నారంటే


ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే గత ప్రభుత్వం చెల్లింపులు చేసిందని... నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థలకు నిధులు మళ్లింపులు జరిగాయి. ఫార్ములా ఈ రేసింగ్‌లో అడ్డగోలుగా వ్యవహారం జరిగిందని రేవంత్ సర్కార్ గుర్తించింది. దీంతో ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంపై దర్యాప్తు ఏసీబీకి ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. 2023లో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ రేసింగ్ నిర్వహించింది. అందుకోసం విదేశీ సంస్థతో ఒప్పందం కేసీఆర్ సర్కార్ కుదుర్చుకుంది. ట్యాంక్ బండ్ చుట్టూ మూడు కిలోమీటర్ల మేర ట్రాక్ నిర్మాణం చేపట్టారు. ఈ సందర్భంగా నిబంధనలు పాటించ లేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించింది. ఆర్థిక శాఖ అనుమతులు లేకుండానే ఎమ్‌ఏయూడీ నుంచి రూ.55 కోట్లు విదేశీ సంస్థలకు చెల్లింపులు జరిగాయి.

స్టేషన్‌కు వెళ్తూ తన భార్యకు అల్లు అర్జున్ చెప్పిందిదే..


ప్రభుత్వం మారిన తర్వాత ఫార్ములా ఈ నిర్వహించడం లేదని విదేశీ సంస్థలు ప్రకటించాయి. దీంతో అంతర్గత దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశించింది. దీంతో దర్యాప్తుతో ఈ రేసింగ్ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. గత అధికారుల నుంచి ప్రభుత్వం వివరణ కోరింది. ఈ విచారణలో కేటీఆర్ సూచనలతోనే చెల్లింపులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో కేటీఆర్‌ను విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీఎస్ శాంతికుమారికి ఏసీబీ లేఖ రాసింది. కేటీఆర్ విచారణకు అనుమతి ఇవ్వాలంటూ రెండు నెలల క్రితం గవర్నర్‌కు జిష్ణు దేవ్ వర్మకు సీఎస్ లేఖ రాశారు. న్యాయ నిపుణులతో చర్చల అనంతరం కేటీఆర్ విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపారు.


ఇవి కూడా చదవండి...

అల్లు అర్జున్ అరెస్ట్.. నెక్ట్స్ జరిగేదిదే..

Pawankalyan: బాబును ఎన్నిసార్లు మెచ్చుకున్నా తక్కువే

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 13 , 2024 | 04:16 PM