Share News

Jobs: రోడ్డెక్కిన గ్రూప్-1 అభ్యర్థులు.. మెయిన్స్ వాయిదా వేయాలని డిమాండ్

ABN , Publish Date - Oct 16 , 2024 | 10:13 PM

గ్రూప్-1 నోటిపికేషన్లను సవాల్ చేస్తూ పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించినప్పటికీ మెయిన్స్ పరీక్షలను వాయిదా వేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది. గ్రూప్‌-1 నోటిఫికేషన్లు సవాల్‌ చేస్తూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేస్తూ.. గ్రూప్-1 మెయిన్‌ పరీక్షలకు అనుమతి ఇచ్చింది. దీంతో ఈనెల 18వ తేదీ నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. కోర్టు ద్వారా చేసిన ..

Jobs: రోడ్డెక్కిన గ్రూప్-1 అభ్యర్థులు..  మెయిన్స్ వాయిదా వేయాలని డిమాండ్
Group-1 Candidates

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలంటూ హైదరాబాద్ అశోక్ నగర్‌లో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. గతంలో జరిగిన ప్రిలిమ్స్ పరీక్షల్లో తప్పులు, జీవో 19 సవరించిన తర్వాతే పరీక్షలు నిర్వమించాలని అభ్యర్థులు నిరసన చేపట్టారు. గ్రూప్‌-1 అభ్యర్థుల ఆందోళనతో అశోక్‌నగర్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్లపైకి అభ్యర్థులు రావడంతో.. భారీగా పోలీసులను మోహరించారు. ఇప్పటి వరకు కొందరు అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కి తరలించారు. గ్రూప్-1 నోటిపికేషన్లను సవాల్ చేస్తూ పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించినప్పటికీ మెయిన్స్ పరీక్షలను వాయిదా వేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది. గ్రూప్‌-1 నోటిఫికేషన్లు సవాల్‌ చేస్తూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేస్తూ.. గ్రూప్-1 మెయిన్‌ పరీక్షలకు అనుమతి ఇచ్చింది. దీంతో ఈనెల 18వ తేదీ నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. కోర్టు ద్వారా చేసిన ప్రయత్నలు ఫలించకపోవడంతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు విద్యార్థులు ఆందోళనకు దిగినట్లు తెలుస్తోంది. కొందరు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను యథావిధిగా నిర్వహించాలని కోరుతుండగా.. తమకు తృటిలో ఉద్యోగాలు తప్పిపోయాయని భావిస్తున్న అభ్యర్థులు పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్నారు.


పిటిషన్ కొట్టేసిన కోర్టు..

గ్రూప్-1 ప్రిలిమ్స్‌పై దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. దీంతో గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు యథావిధిగా ఈ నెల 21 నుంచి జరుగనున్నాయి. ప్రిలిమ్స్‌లోని ఏడు ప్రశ్నలకు తుది ‘కీ’లో సరైన జవాబులు ఇవ్వలేదని పిటిషనర్స్‌ హైకోర్టును ఆశ్రయించారు. వాటికి మార్కులు కలిపి మళ్లీ కొత్త జాబితా ఇవ్వాలని పిటిషనర్లు కోర్టును కోరారు. ప్రిలిమ్స్‌కి, రిజర్వేషన్ల జీవో 33, తదితర అంశాలపై మొత్తంగా గ్రూప్‌-1పై హైకోర్టులో దాదాపు 15కిపైగా కేసులు నమోదయ్యాయి. వాటన్నింటిని కోర్టు కొట్టివేసింది. హైకోర్టు పిటిషన్లు కొట్టివేడయంతో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మెయిన్స్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా మెయిన్స్‌కు 31,382 మంది అభ్యర్థులు హాజరవనున్నారు.


ఏడు ప్రశ్నలపై..

ఈ ఏడాది జూన్‌ 9న జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేయాలంటూ దాఖలైన పలు పిటిషన్లను హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. దీంతో మెయిన్స్‌కు అడ్డంకులు తొలగినట్లయింది. విచారణ సందర్భంగా.. విద్యా సంబంధిత విషయాల్లో నిపుణుల అభిప్రాయాలే కీలకంగా ఉంటాయని, వాటిని కోర్టులు తమ విచక్షణాధికారం ద్వారా పునఃస్థాపించలేవని స్పష్టం చేసింది. జోక్యం చేసుకోవడానికి అవకాశం ఉండదని తేల్చి చెప్పింది. సప్లిమెంటరీ నోటిఫికేషన్‌ ఇచ్చి పరీక్ష నిర్వహించడం చెల్లదని.. ప్రిలిమ్స్‌లోని ఏడు ప్రశ్నలకు తుది ‘కీ’లో సరైన జవాబులు ఇవ్వలేదని, వాటికి మార్కులు కలిపి మళ్లీ జాబితా ఇవ్వాలని, పలు ప్రశ్నలను తొలగించి మళ్లీ ఫలితాలు ప్రకటించేలా ఆదేశించాలని, గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై జస్టిస్‌ పుల్ల కార్తీక్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. 1,721 మంది అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ ద్వారా 6,147 అభ్యంతరాలు వచ్చాయని, వీటిపై టీజీపీఎస్సీ సబ్జెక్టుల వారీగా ప్రఖ్యాత విద్యా సంస్థలకు చెందిన ఫ్రొఫెసర్లతో నిపుణుల కమిటీ వేసిందని హైకోర్టు తెలిపింది. ‘‘విషయ నిపుణుల అభిప్రాయాల ఆధారంగా 56, 59 సంఖ్య కలిగిన ప్రశ్నలను తొలగించి.. 115వ ప్రశ్నకు ఆప్షన్‌ను సవరించి ఫైనల్‌ కీని విడుదల చేసింది. పిటిషనర్లు సమర్పించిన అభ్యంతరాలను నిపుణుల కమిటీ ఒకటికి రెండుసార్లు పరిశీలించాకే ఫైనల్‌ కీ ఇచ్చారని పేర్కొన్న న్యాయస్థానం అభ్యర్థుల పిటిషన్‌ను తోసిపుచ్చింది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 16 , 2024 | 10:13 PM