Share News

Rain Update: హైదరాబాద్‌లో కుండపోత వర్షం

ABN , Publish Date - Aug 12 , 2024 | 07:30 AM

నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మణికొండ, హైటెక్‌సిటీ, అమీర్‌పేట్‌లతో పాటు పలు ప్రాంతాలు జోరు వానపడింది.

Rain Update: హైదరాబాద్‌లో కుండపోత వర్షం
Rain in Hyderabad

హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మణికొండ, హైటెక్‌సిటీ, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఫిలింనగర్, షేక్‌పేట్, భరత్‌నగర్‌, బోరబండ, దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట్‌, కోఠి ప్రాంతంలో కుండపోత వాన పడింది. ఉప్పల్‌, ఎల్‌బీనగర్‌, ఎస్‌ఆర్ నగర్‌లోనూ వర్షం దంచికొట్టింది.


భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి. భారీ వర్షంలో ముందుకు కదలలేని పరిస్థితుల్లో పలుచోట్ల వాహనదారులు తమ వాహనాలను రోడ్డు పక్కన నిలిపివేశారు.


మరోవైపు ఆకాశం మేఘావృతమై ఉంది. భారీ వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణలో 2 రోజుల పాటు వానలు పడతాయని సూచించింది. నిర్మల్‌, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కొత్తగూడెంలో వర్షాలు పడతాయని పేర్కొంది. ఇక భాగ్యనగరం హైదరాబాద్‌లో తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. సికింద్రాబాద్‌లో కూడా వర్షాలు పడతాయని పేర్కొంది.


స్కూల్ బస్సు బీభత్సం..

శంషాబాద్ -బెంగుళూరు హైవేపై స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. సాతంరాయి వద్ద రోడ్డు క్రాస్ చేస్తున్న ఓ పాదాచారిని బస్సు ఢీకొట్టింది. దీంతో సదరు వ్యక్తి గాల్లోకి ఎగిరి బస్‌పై పడ్డాడు. దీంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ప్రమాదం తర్వాత డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయి ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు అంటున్నారు. కాగా ప్రమాద స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Aug 12 , 2024 | 09:20 AM