Share News

Hydra: పెద్దఅంబర్‌పేట మున్సిపల్ కమిషనర్‌పై హైడ్రా కమిషనర్ ఆగ్రహం

ABN , Publish Date - Dec 11 , 2024 | 04:18 PM

Telangana: కుంట్లూర్ పెద్ద చెరువును కబ్జా చేసి రోడ్డు వేస్తున్నారన్న ఆరోపణలతో నిన్నటి నుంచి హైడ్రా అధికారులు సర్వే చేస్తున్నారు. మున్సిపల్ నిధులతో రోడ్డు నిర్మాణానికి తీర్మానం చేయడంపై పెద్దఅంబర్ పేట్ మున్సిపల్ కమిషనర్ సింగిరెడ్డి రవీందర్ రెడ్డిపై రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో త్వరలో కమిషనర్‌పై యాక్షన్ తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Hydra: పెద్దఅంబర్‌పేట మున్సిపల్ కమిషనర్‌పై హైడ్రా కమిషనర్ ఆగ్రహం
Hydra Commissioner Ranganath

రంగారెడ్డి, డిసెంబర్ 11: రంగారెడ్డి జిల్లా కుంట్లూర్ పెద్ద చెరువు కబ్జాపై హైడ్రా సర్వే చేస్తున్న స్థలాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydra Commissioner Ranganath) బుధవారం పరిశీలించారు. కుంట్లూర్ పెద్ద చెరువును కబ్జా చేసి రోడ్డు వేస్తున్నారన్న ఆరోపణలతో నిన్నటి నుంచి హైడ్రా అధికారులు సర్వే చేస్తున్నారు. మున్సిపల్ నిధులతో రోడ్డు నిర్మాణానికి తీర్మానం చేయడంపై పెద్దఅంబర్ పేట్ మున్సిపల్ కమిషనర్ సింగిరెడ్డి రవీందర్ రెడ్డిపై రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో త్వరలో కమిషనర్‌పై యాక్షన్ తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Payyavula: ఏపీని పునర్మించేందుకు కలిసి పనిచేద్దాం


చెరువు భూమిలో ఎలా రోడ్డుకు నిధులు కేటాయిస్తారని రంగనాథ్ ప్రశ్నించారు. సర్వే త్వరగా పూర్తి చేసి చెరువు, పట్టా భూమి బార్డర్‌లో రోడ్డు ఫిక్స్ చేయాలని హైడ్రా సిబ్బందికి ఆయన సూచించారు. చెరువు స్థలంలో రోడ్డు వేస్తే తొలగించాలని హైడ్రా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అయితే రోడ్డు నిర్మాణంలో థర్డ్ పార్టీ చేశారని హైడ్రా కమిషనర్‌కు పెద్ద అంబర్‌పేట్ మున్సిపల్ కమిషనర్ వివరించారు. ఈ రోడ్డు విషయంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. థర్డ్ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు వారిపై కేసులు పెట్టాలి కదా ఎందుకు యాక్షన్ తీసుకోలేదని రంగనాధ్ ప్రశ్నించారు.

మోహన్‌బాబుకు బిగ్ రిలీఫ్


కాగా.. కుంట్లూరులోని 185 సర్వే నెంబర్లలోని 96 ఎకరాల భూమి కబ్జాకు గురవుతోందంటూ హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆ స్థలాన్ని పరిశీలించేందుకు నిన్ననే హైడ్రా అధికారులు అక్కడకు చేరుకుని సర్వే నిర్వహించారు. కుంట్లూరులోని 185 సర్వే నెంబర్లోని 95 ఎకరాల చెరువు భూమిలో మున్సిపాలిటీ నుంచి రూ.20 లక్షలు కేటాయించి వ్యవసాయ భూమి వద్దకు సిసి రోడ్ వేసేందుకు మున్సిపల్ వైస్ చైర్‌ పర్సన్, బంధువులు, కమిషనర్ రవీందర్ రెడ్డిలు సర్వసభ్య సమావేశంలో తీర్మానించారు. ఇది పూర్తిగా అక్రమాలకు తావిచ్చే విధంగా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని కేవలం వ్యవసాయ భూమి వద్దకే రోడ్డు వేసేందుకు చెరువు స్థలాన్ని కబ్జా చేస్తున్నారని కుంట్లూర్‌కు చెందిన మాజీ సర్పంచ్ కళ్లెం ప్రభాకర్ రెడ్డి, కళ్లెం వెంకటరెడ్డిలు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా అధికారులు మంగళవారం చెరువు వద్దకు చేరుకుని సర్వే చేశారు. అయితే హైడ్రా అధికారులను కొందరు అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. వారిని పోలీసులు అడ్డుకుని అక్కడి నుంచి పంపించి వేశారు.


ఇవి కూడా చదవండి...

Kadapa: రాఘవరెడ్డి విచారణ.. ఎంపీ అవినాష్‌ మెడకు బిగుస్తున్న ఉచ్చు

సంచలన విషయాలు బయటపెట్టిన మనోజ్..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 11 , 2024 | 04:18 PM