Share News

Rain Alert: భాగ్యనగరంలో దంచికొడుతున్న భారీ వర్షం

ABN , Publish Date - Sep 06 , 2024 | 05:37 PM

ఇటీవలే కురిసిన భారీ వర్షాలతో తడిసి ముద్దైన భాగ్యనగరం హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. 5 గంటల సమయంలో వాన ఆరంభమైంది. నగరవ్యాప్తంగా వర్షం పడుతోంది.

Rain Alert: భాగ్యనగరంలో దంచికొడుతున్న భారీ వర్షం

హైదరాబాద్: ఇటీవలే కురిసిన భారీ వర్షాలతో తడిసి ముద్దైన భాగ్యనగరం హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. 5 గంటల సమయంలో వాన ఆరంభమైంది. నగరవ్యాప్తంగా వర్షం పడుతోంది. నాంపల్లి, లక్డీకపూల్, మాసబ్ ట్యాంక్ ప్రాంతాల్లోనైతే కుండపోత వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహదీపట్నం, టోలిచౌకీ, షేక్‌పేట్, ఫిలింనగర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, హఫీజ్‌పేట్‌లలో కూడా వర్షం కురుస్తోంది.


సాయంత్రం 5 గంటల వరకు హైదరాబాద్‌లో వాతావరణం కాస్త పొడిగానే కనిపించింది. అయితే ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం ఎండగా ఉన్నప్పటికీ సాయంత్రానికి పరిస్థితి మొత్తం మారిపోయింది.


మళ్లీ మొదలైన ట్రాఫిక్ కష్టాలు

అనూహ్యంగా భారీ వర్షం పడుతుండడంతో మహానగరం హైదరాబాద్‌లో మళ్లీ ట్రాఫిక్ సమస్య మొదలైంది. ఎక్కడికక్కడ రోడ్లపై వరద పారుతుండడంతో వాహనదారులు నెమ్మదిగా వెళ్లాల్సి వస్తోంది. ముఖ్యంగా ఉద్యోగులు, కాలేజీ విద్యార్థులు ఇంటికి వెళ్లే సమయం కావడంతో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంది. మరోవైపు రేపు (శనివారం) వినాయక చవితి నేపథ్యంలో ఆ సందడి కూడా నగరంలో కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన పనులకు కూడా వర్షం ఆటంకంగా మారింది.

Updated Date - Sep 06 , 2024 | 05:50 PM