Share News

Komatireddy: సంధ్య థియేటర్ ఎఫెక్ట్.. సినిమాలపై కోమటిరెడ్డి సంచలన నిర్ణయం

ABN , Publish Date - Dec 06 , 2024 | 11:46 AM

Telangana: సంధ్య థియేటర్ దగ్గర జరిగిన సంఘటన బాధ కలిగించిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రేవతి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఇక నుంచి బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వమంటూ సంచలన ప్రకటన చేశారు. హీరోలు అలాంటి టైంలో వెళ్ళడం కరెక్టేనా అని ప్రశ్నించారు. ఈ ఘటనపై చట్ట పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.

Komatireddy:  సంధ్య థియేటర్ ఎఫెక్ట్.. సినిమాలపై కోమటిరెడ్డి సంచలన నిర్ణయం
Minister komatireddy Venkatreddy

హైదరాబాద్, డిసెంబర్ 6: పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్పా 2 సినిమా చూసేందుకు వచ్చి అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతిచెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి (Minister Komatireddy Venkatreddy) స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... సంధ్య థియేటర్ దగ్గర జరిగిన సంఘటన బాధ కలిగించిందన్నారు. రేవతి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఇక నుంచి బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వమంటూ సంచలన ప్రకటన చేశారు.

KCR: ఆ విషయంలో అంబేద్కర్ దార్శనికత మహోన్నతం


హీరోలు అలాంటి టైంలో వెళ్ళడం కరెక్టేనా అని ప్రశ్నించారు. ఈ ఘటనపై చట్ట పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనపై హీరో కానీ చిత్ర యూనిట్ స్పందించకపోవడం బాధాకరమన్నారు. మనిషి ప్రాణం తీస్కొస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలకోట్ల కలక్షన్స్ అని చెప్తున్నారు కదా బాధితులకు 25 లక్షలు ఇవ్వాలని.. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ‘‘ఆ సినిమా హీరోకి , ప్రొడ్యూసర్స్‌కు చెప్తున్న.. వాళ్ళని ఆదుకోండి’’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.


ఇదీ జరిగింది...

కాగా.. అల్లుఅర్జున్ నటించిన పుష్పా -2 నిన్న (గురువారం) రిలీజ్ అయ్యింది. ఈ క్రమంలో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన భాస్కర్ కుటుంబం సినిమాను చూసేందుకు సంధ్యా థియేటర్‌కు వచ్చారు. అదే సమయంలో సినీ హీరో థియేటర్‌కు వస్తున్నారని తెలిసి పెద్ద ఎత్తున ప్రేక్షకులు అక్కడకు వచ్చారు. దీంతో ఆ ప్రాంతంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో భాస్కర్ భార్య రేవతి, కుమారుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే బాలుడికి అక్కడి పోలీసులు సీపీఆర్ చేసి ఆ తరువాత దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడు చికిత్స పొందుతున్నాయి. అయితే రేవతి తీవ్ర అస్వస్థతతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. తమ కుమారుడు పుష్ప హీరోను అభిమానిస్తాడని.. అందుకోసమే సినిమా చేసేందుకు వచ్చామని.. కానీ ఇలా తన భార్య ప్రాణాలను కోల్పోతుందని ఊహించలేకపోయాని భర్త భాస్కర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.


ఎన్‌హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు..

మరోవైపు ‘పుష్ప-2’ సినిమాపై న్యాయవాది రామారావు ఇమ్మినేని జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్సీ) కు ఫిర్యాదు చేశారు. సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిందని.. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రద్దీని ముందే అంచనా వేసే అవకాశం ఉన్నా పోలీసులు సరైన రీతిలో స్పందించకపోవడంపైనా ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారంటూ ఫిర్యాదులో తెలిపారు. చిక్కడపల్లి పోలీసులు అత్యుత్సాహంతో లాఠీ చార్జ్ చేయడం, ముందస్తు జాగ్రత్తలేమీ తీసుకోకపోవడంతోనే మహిళ మృతి చెందినట్టు పిటిషనర్ ఆరోపించారు. ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్సీ దీనిపై దర్యాప్తు జరపనుంది.


ఇవి కూడా చదవండి..

భవిష్యత్తులో ఆ దేశం అంతరించిపోతుంది.. ఎలాన్ మస్క్ హెచ్చరిక

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 06 , 2024 | 12:32 PM