Share News

Ponguleti: అక్కడకు వెళ్లాలని బాగా ఆత్రుతగా ఉందా.. కేటీఆర్‌పై పొంగులేటి సెటైర్

ABN , Publish Date - Dec 07 , 2024 | 11:03 AM

Telangana: ‘‘నేను బాంబులు అనగానే కేటీఆర్ ఉలిక్కిపడ్డారు.. బాంబులు పేలతాయి అనగానే ఢిల్లీకి ఎందుకు వెళ్లారు. కేంద్ర పెద్దలతో ఏం ఒప్పందం చేసుకున్నారు. నేను అమిత్ షా కాళ్లు మొక్కిన అనడానికి సిగ్గుండాలి.. నా తల్లిదండ్రుల తర్వాత నేను కేసీఆర్ కాళ్లు మాత్రమే మొక్కిన. మెడలో పార్టీ కండువా వేసి ఆ కండువాతో నా గొంతు కోశారు. ఐదేళ్లు నా రాజకీయ జీవితం నాశనం చేశారు’’ అంటూ కేటీఆర్‌పై పొంగులేటి ఫైర్ అయ్యారు.

Ponguleti: అక్కడకు వెళ్లాలని బాగా ఆత్రుతగా ఉందా.. కేటీఆర్‌పై పొంగులేటి సెటైర్
Minister Ponguleti Srinivas Reddy

హైదరాబాద్, డిసెంబర్ 7: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై (BRS Working President KTR) మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) మరోసారి విరుచుకుపడ్డారు. జైలుకు వెళ్లడానికి కేటీఆర్‌కు ఆత్రుత ఎందుకు అంటూ హాట్ కామెంట్స్ చేశారు. తప్పు రుజువైనప్పుడు జైలుకు వెళ్లడం ఖాయమని స్పష్టం చేశారు.

ఆ బాధ్యత నెరవేరుస్తా.. సీఎం రేవంత్‌రెడ్డి ఎమోషనల్ ట్వీట్


‘‘నేను బాంబులు అనగానే కేటీఆర్ ఉలిక్కిపడ్డారు.. బాంబులు పేలతాయి అనగానే ఢిల్లీకి ఎందుకు వెళ్లారు. కేంద్ర పెద్దలతో ఏం ఒప్పందం చేసుకున్నారు. నేను అమిత్ షా కాళ్లు మొక్కిన అనడానికి సిగ్గుండాలి.. నా తల్లిదండ్రుల తర్వాత నేను కేసీఆర్ కాళ్లు మాత్రమే మొక్కిన. మెడలో పార్టీ కండువా వేసి ఆ కండువాతో నా గొంతు కోశారు. ఐదేళ్లు నా రాజకీయ జీవితం నాశనం చేశారు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


బీఆర్‌ఎస్ నేతలు పగటి కలలు మానుకోవాలని హితవుపలికారు. బీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదన్నారు. రాజీవ్ గాంధీ, తెలంగాణ తల్లి విగ్రహాలను మార్చేది లేదన్నారు. విగ్రహాలు ఉండాల్సిన చోటనే ఉన్నాయన్నారు. రైతులను యువకులను బీఆర్‌ఎస్ మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు రుణమాఫీ చేశామని, యువకులకు 57 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకొచ్చారు. ఏడాది పాలనలో తాము చెప్పని హామీలు కూడా నెరవేర్చామన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

CM REVANTH REDDY: అవనిపై అగ్ర భాగాన తెలంగాణను నిలుపుతా

Hyderabad: హైదరాబాద్‌ను దేశ 2వ రాజధానిగా ప్రకటించాలి..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 07 , 2024 | 11:06 AM