Pawan Kalyan: తెలంగాణ జనసేన నేతలతో పవన్ కల్యాణ్ భేటీ?
ABN , Publish Date - Jun 30 , 2024 | 10:51 AM
హైదరాబాద్: ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ఆదివారం హైదరాబాద్ మాదాపూర్ తన నివాసంలో ఉన్నారు. కొండగట్టు గట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని శనివారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఈరోజు హైదరాబాద్‌లోనే ఆయన ఉండనున్నారు.
హైదరాబాద్: ఏపీ ఉప ముఖ్యమంత్రి (Deputy CM), జనసేన పార్టీ అధినేత (Janasena Chief), సినీ నటుడు (Tolly Wood Hero) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆదివారం హైదరాబాద్ మాదాపూర్ తన నివాసంలో ఉన్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని శనివారం రాత్రి హైదరాబాద్ (Hyderabad) చేరుకున్నారు. ఈరోజు హైదరాబాద్‌లోనే ఆయన ఉండనున్నారు. తెలంగాణ జనసేన నేతలతో (Telangana Jasena Leaders) పవన్ సమావేశమైయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. సోమవరం సొంత నియోజకవర్గం పిఠాపురం వెళ్ళనున్నారు. సామాజిక పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు.
అంజన్న చెంతన పవన్..
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శనివారం జగిత్యాల జిల్లా, మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. తాను ఇలవేల్పుగా కొలిచే ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో దీక్షా వస్త్రాలు, తలపాగాతో ఆలయానికి వచ్చిన పవన్ కల్యాణ్‌కు మేళతాళాలతో అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్ పవన్ కల్యాణ్‌కు పూలమొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం పవన్ కల్యాణ్ కొండగట్టు అంజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పవన్ కల్యాణ్ గోత్రనామాలతో అర్చకులు పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందించారు. ఆశీర్వచనం అందించి శేష వస్త్రాన్ని, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
కాగా గతేడాది పవన్ కల్యాణ్ తన ప్రచార వాహనం వారాహికి కొండగట్టులోనే పూజలు చేసి.. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తాను ఆశించిన ఫలితాలు రావడంతో అంజన్నకు మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నాగార్జున యూనివర్శిటీ వీసీ రాజీనామా..
ఏపీలో పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి..
భారత క్రికెట్ టీం చరిత్ర సృష్టించింది: సీఎం చంద్రబాబు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News