Share News

KA Paul: కాంగ్రెస్‌ ఏడాది పాలనకు కేఏ పాల్ ఇచ్చిన రేటింగ్ ఎంతో తెలుసా

ABN , Publish Date - Dec 09 , 2024 | 04:46 PM

Telangana: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏపాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీలు పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. రైతులను అప్పులు చేయండి రుణమాఫీ చేస్తా అన్నారని.. 78 శాతం రైతులకు రుణ మాఫీ జరగలేదన్నారు. ధరణి పోర్టల్ గురించి మాట్లాడటం లేదన్నారు. 56 వేలకోట్ల విలువైన నిర్మాణాలను హైడ్రా పేరుతో కూల్చారని.. చట్ట విరుద్ధంగా హైడ్రా పెట్టారంటూ మండిపడ్డారు.

KA Paul: కాంగ్రెస్‌ ఏడాది పాలనకు కేఏ పాల్ ఇచ్చిన రేటింగ్ ఎంతో తెలుసా
Prajashanti party Chief KA paul

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పాలనను పూర్తి చేసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పాలన విజయోత్సవాల పేరిట కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటోంది కూడా. అయితే తెలంగాణ కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏపాల్ (Prajashanti party Chief KA Paul) ఇచ్చిన రేటింగ్ చూస్తే అవాక్కవ్సాల్సిందే. తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలన‌కు కేవలం - 1 రేటింగ్ మాత్రమే పాల్ ఇచ్చారు. తెలంగాణలో అవినీతి, ప్రజా వ్యతిరేకుల పాలన జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు పరచకుండా లక్ష కోట్ల అప్పు చేశారన్నారు.

Harishrao: తెలంగాణ తల్లి విగ్రహమంటూనే ఆశా తల్లులపై దాడి.. ఇదెక్కడి న్యాయం


ఇచ్చిన ఆరు గ్యారెంటీలు పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. రైతులను అప్పులు చేయండి రుణమాఫీ చేస్తా అన్నారని.. 78 శాతం రైతులకు రుణ మాఫీ జరగలేదన్నారు. ధరణి పోర్టల్ గురించి మాట్లాడటం లేదన్నారు. 56 వేలకోట్ల విలువైన నిర్మాణాలను హైడ్రా పేరుతో కూల్చారని.. చట్ట విరుద్ధంగా హైడ్రా పెట్టారంటూ మండిపడ్డారు. ఏడాది కాలంలో కట్టిన నిర్మాణాలు లేవని.. తీసుకు వచ్చిన కంపెనీలు లేవన్నారు. 150 కంపెనీలు తెలంగాణ వదిలి వెళ్లిపోయాయని తెలిపారు. ఉద్యోగ కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. తెలంగాణలో 60 లక్షల నిరుద్యోగులున్నారన్నారు. విద్య , ఆరోగ్య కల్పనలో వైఫల్యం చెందిందని ఆయన విమర్శలు గుప్పించారు.


సర్పంచ్ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ నుంచి పోటీ చేయాలని పాల్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు సర్పంచ్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. డిసెంబర్ 12 నుంచి జనవరి 29 వరకు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో పర్యటిస్తానన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో ప్రజా శాంతి పార్టీ నుంచి సర్పంచ్‌లు గెలిస్తే 100 రోజుల్లో అభివృద్ధిని తెలంగాణ ప్రజలకు చూపిస్తా అని స్పష్టం చేశారు. 60 శాతం ఉన్న బీసీలు ఇంకెంతకాలం జెండాలు మోస్తారని ప్రశ్నించారు. ఇండియా కూటమి బాధ్యతలను మమత బెనర్జీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. బీసీలకు కాంగ్రెస్ పగ్గాలు అప్పగించాలని.. అప్పుడే కాంగ్రెస్ పార్టీకి విలువ పెరుగుతుందన్నారు. దేశంలో బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు జరగాలని.. అప్పుడే పార్టీల సత్తా తెలుస్తుందన్నారు. దేశంలో ఆర్గజైన్డ్ క్రైం జరుగుతోందన్నారు. రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుస్తుంది కానీ కేంద్రంలో కాంగ్రెస్ రాదన్నారు. దేశంలో బ్యాలెట్ పెపర్ ద్వారా ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు అవకాశం ఇచ్చారని బీజేపీ లేదన్నారు. మార్పు కోసం ప్రజాశాంతి పార్టీకి అవకాశం ఇవ్వాలని కేఏపాల్ కోరారు.


ఇవి కూడా చదవండి...

రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన చరిత్ర బీఆర్‌ఎ్‌సదే

ఎస్సై ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. వీడియో విడుదల.

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 09 , 2024 | 04:46 PM