Share News

Rain Alert: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మొదలైన వర్షం

ABN , Publish Date - Aug 13 , 2024 | 07:10 AM

ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షంతో తడిసి ముద్దయిన హైదరాబాద్ మహానగరంలో మరోసారి వాన మొదలైంది.

Rain Alert: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మొదలైన వర్షం

హైదరాబాద్, ఆగస్టు 13: ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షంతో తడిసి ముద్దయిన హైదరాబాద్ మహానగరంలో మరోసారి వాన మొదలైంది. మంగళవారం ఉదయం ఒక్కసారిగా వాతావరణం మారింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్‌లలో వర్షం మొదలైంది. మరిన్ని ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షం కురుస్తోంది.


నాలుగు రోజుల పాటు వర్షాలు..

కాగా రానున్న 4 రోజులు కూడా హైదరాబాద్ నగరంలో మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. వాతావరణం మేఘావృతమై ఉంటుందని అంచనాగా ఉంది. హైదరాబాద్‌లో ఆగస్టు 15 వరకు నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సోమవారం అప్రమత్తం చేసింది. గురువారం వరకు నగరంలో వానలు పడతాయని, ప్రధానంగా వాతావరణం మేఘావృతమై ఉంటుందని పేర్కొంది. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడతాయని పేర్కొంది. హైదరాబాద్‌తో పాటు సంగారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, కరీంనగర్‌లలో వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపింది.


కాగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో భారీ వర్షం పడింది. కాగా నగరంలో ఈ వర్షాకాలంలో ఇప్పటివరకు కురిసిన వర్షపాతం సగటు కంటే తక్కువని వాతావరణ శాఖ చెబుతోంది. ఇది సాధారణ 342.2 మిల్లీ మీటర్లు కాదా.. 330.2 మిల్లీ మీటర్లు వర్షం పాతం నమోదయిందని, స్వల్పంగా 4 శాతం తక్కువని వివరించింది.

Updated Date - Aug 13 , 2024 | 12:00 PM