TG Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇంకెన్ని రోజులంటే..
ABN , Publish Date - Dec 16 , 2024 | 04:38 PM
Telangana: బీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు వాకౌట్ చేశారు. సభా పని దినాలు, సబ్జెక్ట్‌పై క్లారిటీ ఇవ్వనందుకు వాకౌట్ చేసిన బీఆర్ఎస్ ప్రకటించింది. మరోవైపు టీ షర్ట్స్పై బీఏసీలో వాడి వేడి చర్చ జరిగింది. టీ షర్ట్స్ వేసుకుని వస్తే తప్పేంటని బీఆర్ఎస్ సభ్యులు ప్రశ్నించారు. పార్లమెంట్ కు రాహుల్ గాంధీ టి షర్ట్స్ వేసుకుని వెళ్లడం లేదా అని సమావేశంలో హరీష్ రావు ప్రశ్నించారు.
హైదరాబాద్, డిసెంబర్ 16: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly session) మరో ఐదు రోజుల పాటు జరుగనున్నాయి. ఈ మేరకు బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 21 వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఈరోజు మధ్యాహ్నం అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్లో బీఏసీ సమావేశమైంది. అయితే బీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు వాకౌట్ చేశారు. సభా పని దినాలు, సబ్జెక్ట్‌పై క్లారిటీ ఇవ్వనందుకు వాకౌట్ చేసిన బీఆర్ఎస్ ప్రకటించింది. మరోవైపు టీ షర్ట్స్పై బీఏసీలో వాడి వేడి చర్చ జరిగింది. టీ షర్ట్స్ వేసుకుని వస్తే తప్పేంటని బీఆర్ఎస్ సభ్యులు ప్రశ్నించారు. పార్లమెంట్‌కు రాహుల్ గాంధీ టీ షర్ట్స్ వేసుకుని వెళ్లడం లేదా అని సమావేశంలో హరీష్ రావు ప్రశ్నించారు.
పోలవరం ప్రాజెక్ట్‌పై సీఎం చంద్రబాబు క్లారిటీ
అందుకే వాకౌంట్: హరీష్ రావు
బీఏసీ సమావేశంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. గంట సేపు సమావేశం జరిగినా సభ పనిదినాలపై స్పష్టత ఇవ్వడం లేదని ఆయన అన్నారు. అందుకే బీఏసీ నుంచి వాకౌట్ చేసినట్ల మాజీ మంత్రి తెలిపారు. ‘‘మేము 15రోజులు సభ పెట్టాలని అడిగాము. సభను నాలుగైదు రోజులే నడిపే మూడ్‌లో ఉన్నారు. మమ్మల్ని అడ్వయిజ్ మాత్రమే ఇవ్వాలని సీఎం అన్నారు. కేవలం సలహా మాత్రమే ఇవ్వాలని అంటున్నారు. ఇదే విషయంపై ఎంఐఎం కూడా వాక్ ఔట్ చేసింది. ప్రోటోకాల్ పాటించడం లేదని స్పీకర్‌కు చెప్పాం. బీఏసీ పెట్టకుండానే బిల్స్ ఎలా పెడతారు అని అడిగాము. పెళ్ళిళ్లు ఉన్నాయని సభ పెట్టకపోవడం ఏంటని అడిగాము. కనీసం 15 రోజులు ఈసారి సభ నడపాలని బీఆర్ఎస్ నుంచి అడిగాం. ప్రతిరోజూ జీరో అవర్ పెట్టాలని అడిగాం. టీషర్ట్‌లతో ఎందుకు రానియడం లేదని గట్టిగా అడిగాము. మీ నాయకుడు రాహుల్ గాంధీ టీ షర్ట్లతో వెళ్ళాడు కదా అని గుర్తు చేశాము. బీఏసీ అంటే బిస్కెట్ అండ్ చాయ్ లాగా చేశారు’’ అంటూ హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు.
శ్రీధర్ బాబు సీరియస్..
అయితే బీఏసీ నుంచి బీఆర్ఎస్, ఎమ్ఐఎం వాకౌట్‌పై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఏపీ, గత పదేళ్ళలో అందరి ఆలోచనలపై బీఏసీలో చర్చ జరుగుతుందన్నారు. సభ ఎన్ని రోజులు జరపాలి అనేది స్పీకర్ నిర్ణయం. గత పదేళ్ళలో వట్టి చాయ్ బిస్కెట్ తాగి వచ్చారా?.. ఈ వారం రోజులు సభ జరిగే అవకాశం ఉంటుంది. స్పీకర్‌ను బీఆర్ఎస్ - ఎంఐఎం అవమానించింది అంటూ మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
Drugs Racket : అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు... భారీగా డ్రగ్స్ స్వాధీనం
BRS: కేసీఆర్ ఆనవాళ్లను చేరిపేయడం నీ తరం కాదు..: కేటీఆర్
Read Latest Telangana News And Telugu News