Share News

TG Govt: లగచర్ల భూసేకరణ... నిన్న రద్దు.. నేడు నోటిఫికేషన్

ABN , Publish Date - Nov 30 , 2024 | 10:33 AM

Telangana: వికారాబాద్ జిల్లా లగుచర్ల, పోలేపల్లి, హకీంపేట పరిధిలో ఫార్మా విలేజ్ స్థానంలో మల్టిపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్‌కు సర్కార్ ప్రణాళికను రూపొందిస్తోంది. ఈ మేరకు మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు కోసం భూమిని సమీకరించనున్నట్లు నోటిఫికేషన్‌లో తెలియజేసింది. వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలం లగచర్లలో 110.32 ఎకరాల భూ సేకరణకు నోటిఫికేషన్ విడుదలైంది.

TG Govt: లగచర్ల భూసేకరణ... నిన్న రద్దు.. నేడు నోటిఫికేషన్
Telangana Govt

వికారాబాద్, నవంబర్ 30: జిల్లాలో భూసేకరణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ఇచ్చిన కొత్త నోటిఫికేషన్‌లో పలు జాగ్రత్తలు తీసుకుంది. భూములు ఇచ్చేందుకు ఆసక్తిగా ఉన్న రైతుల నుంచి మొదట భూసేకరణ చేస్తామని తెలిపారు. సర్వే నెంబర్, రైతు పేరుతో సహా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. బలవంతంగా భూములు లాక్కోబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. ఆ స్థానంలో మల్లీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు‌కు ప్లాన్ చేస్తోంది. ప్రజల అంగీకారంతోనే భూసేకరణ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.

దూసుకొస్తున్న ‘ఫెంగల్‌’


వికారాబాద్ జిల్లా లగుచర్ల, పోలేపల్లి, హకీంపేట పరిధిలో ఫార్మా విలేజ్ స్థానంలో మల్టిపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్‌కు సర్కార్ ప్రణాళికను రూపొందిస్తోంది. ఈ మేరకు మల్టిపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు కోసం భూమిని సేకరించనున్నట్లు నోటిఫికేషన్‌లో తెలియజేసింది. వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలం లగచర్లలో 110.32 ఎకరాల భూ సేకరణకు నోటిఫికేషన్ విడుదలైంది. అలాగే పోలేపల్లి గ్రామంలో 71.89 ఎకరాల భూ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. భూసేకరణ చట్టం 2013 సెక్షన్ 11 ప్రకారం నోటిఫికేషన్‌ను వికారాబాద్ జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. ఆ మేరకు బహిరంగ ప్రకటన విడుదలైంది. భూములు ఇచ్చేందుకు ఆసక్తిగా ఉన్న రైతుల నుంచి మొదట భూసేకరణ చేయనుంది. సర్వే నంబర్, రైతు పేరుతో సహా భూ సేకరణ నోటిఫికేషన్ విడుదల చేసింది. లగచర్ల, పోలేపల్లిలో ఫార్మా విలేజ్ భూసేకరణ కోసం గత ఆగస్టులో ఇచ్చిన ఇచ్చిన నోటిఫికేషన్ ప్రభుత్వం వాపస్ తీసుకున్న విషయం తెలిసిందే. ఆ స్థానంలో మల్టి పర్పస్ ఇండస్ట్రియల్ పార్క్‌కు ప్లాన్‌ను సిద్ధం చేసింది. ప్రజల అంగీకారంతోనే భూ సేకరణ చేస్తామని.. బలవంతంగా భూములు లాక్కోమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.

Hyderabad: కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరల వివరాలివే..


కాగా.. లగచర్ల, పోలేపల్లిలో ఫార్మా విలేజ్ భూసేకరణ కోసం గత ఆగస్టులో ఇచ్చిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు నిన్న (శుక్రవారం) వికారాబాద్‌ కలెక్టర్ ప్రకటనను విడుదల చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం వచ్చిన జిల్లా కలెక్టర్‌పై గ్రామస్థులు దాడి చేయడం ఎంతటి చర్చకు దారి తీసిందో అందరికీ తెలిసిందే. ఈ దాడికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి సహా 28 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసుల చర్యలపై గ్రామస్థులు ఢిల్లీకి వెళ్లి మానవ హక్కుల కమిషన్‌‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కమిషన్‌ బృందాలు రాష్ట్రానికి వచ్చి విచారణ జరిపింది. ఈ క్రమంలో ఫార్మా విలేజ్ నిర్ణయంపై సర్కార్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. దాని స్థానంలో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్‌‌ను ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది.


ఇవి కూడా చదవండి...

అర్ధరాత్రి గందరగోళం.. వార్డెన్‌ సస్పెండ్

ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ కథ విషాదాంతం..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 30 , 2024 | 10:42 AM