TG Govt: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు సర్కార్ సరికొత్త యోచన
ABN , Publish Date - Dec 03 , 2024 | 09:45 AM
Telangana: ఎలివేటర్ కారిడార్ నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఎలివేటెడ్ కారిడార్ కోసం తాజాగా భూ సేకరణ నోటిఫికేషన్ విడుదలైంది. పారడైజ్ జంక్షన్ నుంచి శామీర్‌పేట ఓఆర్ఆర్ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి భూసేకరణ సర్కార్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 2013 భూ సేకరణ చట్టం సెక్షన్11(1) ప్రకారం మొత్తం 8 నోటిఫికేషన్‌లను ప్రభుత్వం విడుదల చేసింది.
హైదరాబాద్, డిసెంబర్ 3: నగరంలో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం (Telangana Govt) అనేక మార్గాలను అన్వేషిస్తోంది. ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరే ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు పలు చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌ల నిర్మాణానికి ఇప్పటికే శ్రీకారం చుట్టింది. అలాగే మరింత వేగంగా గమ్యాలను చేరుకునేందుకు ఎలివేటర్ కారిడార్ల నిర్మాణాన్ని తెరపైకి తీసుకువస్తోంది రేవంత్ సర్కార్. దీనికి సంబంధించి భూసేకరణ కోసం పలు నోటిఫికేషన్‌లు జారీ చేసింది. ఇంతకీ ప్రభుత్వం ఏఏ ప్రాంతాల్లో ఎలివేటర్ల నిర్మాణానికి నోటిఫికేషన్ జారీ చేసిందో ఇక్కడ చూద్దాం..
సచివాలయ వ్యవస్థలో సమూల మార్పులు
ఎలివేటర్ కారిడార్ నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఎలివేటెడ్ కారిడార్ కోసం తాజాగా భూ సేకరణ నోటిఫికేషన్ విడుదలైంది. పారడైజ్ జంక్షన్ నుంచి శామీర్‌పేట ఓఆర్ఆర్ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి భూసేకరణ సర్కార్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 2013 భూ సేకరణ చట్టం సెక్షన్11(1) ప్రకారం మొత్తం 8 నోటిఫికేషన్‌లను ప్రభుత్వం విడుదల చేసింది. హైదరాబాద్ జిల్లా తిరుమలగిరి మండలం కాకాగూడ, తోకట్ట గ్రామాల్లో 40, 213.516 చదరపు గజాల భూ సేకరణకు నోటిఫికేషన్ జారీ అయ్యింది.
హైదరాబాద్ జిల్లా తిరుమలగిరి మండలం ఖాకాగూడ, తిరుమలగిరి గ్రామాల్లో ఒక చోట 17,607 చదరపు గజాలు, మరోచోట 20, 241.95 చదరపు గజాల భూ సేకరణకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ అయ్యింది. అలాగే హైదరాబాద్ జిల్లా తిరుమలగిరి గ్రామంలో మూడు ప్రాంతాల్లో భూసేకరణ కోసం మూడు వేరు వేరు నోటిఫికేషన్‌లను అధికారులు రిలీజ్ చేశారు. హైదరాబాద్ జిల్లా ఒకచోట13,510.10 చదరపు గజాలు, మరోచోట11, 973.40 చదరపు గజాలు, ఇంకో చోట 11,836. 67 చదరపు గజాల భూ సేకరణ కోసం మూడు వేరు వేరు నోటిఫికేషన్‌ను రెవెన్యూ శాఖ విడుదల చేసింది.
హైదరాబాద్ జిల్లా తిరుమలగిరి మండలం తోకట్ట గ్రామంలో 35, 360. 76 చదరపు గజాల భూసేకరణకు నోటిఫికేషన్ విడుదలైంది. హైదరాబాద్ జిల్లా తిరుమలగిరి, మచ్చ బొల్లారం గ్రామాలలో 12, 150.17 చదరపు గజాల భూ సేకరణకు మరో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అలాగే పారడైజ్ జంక్షన్ నుంచి శామీర్‌పేట ఓఆర్ఆర్ వరకు మొత్తం162,893.61 చదరపు గజాల భూ సేకరణ కోసం ఎనిమిది నోటిఫికేషన్స్‌ను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. భూ సేకరణపై అభ్యంతరాలు ఉంటే 60 రోజుల వరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలియజేయవచ్చని నోటిఫికేషన్‌లో అధికారులు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
మాజీ ఎమ్మె ల్యే ద్వారంపూడికి మరో షాక్
టీడీపీలోకి వైసీపీ ముఖ్య నేత.. ఎవరంటే..
Read Latest Telangana News And Telugu News