TG Highcourt: ఏటూరు నాగారం ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో వాదనలు ఇవే..
ABN , Publish Date - Dec 02 , 2024 | 04:43 PM
Telangana: ఏలూరు నాగారంలో మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మావోల ఎన్‌కౌంటర్‌పై ఈరోజు (సోమవారం) న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌పై పౌరహక్కుల సంఘం లంచ్‌మోషన్ పిటిషన్‌ను దాఖలు చేసింది. మావోయిస్టుల భోజనంలో విష ప్రయోగం జరిగిందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 2: ములుగు జిల్లా ఏటూరునాగారంలో మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై (Maoist encounter) హైకోర్టులో (Telangana High Court) సోమవారం విచారణ జరిగింది. పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్ చేశారని పౌరహక్కుల సంఘం తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. భోజనంలో మత్తు పదార్థాలు కలిపి మావోయిస్టులను కస్టడీలోకి తీసుకున్నారని వాదించారు. ఆ తర్వాత చిత్రహింసలకు గురిచేసే కాల్చి చంపారని పౌరహక్కుల సంఘం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మావోయిస్టుల మృతదేహాలపై తీవ్ర గాయాలున్నాయన్నారు. మృతదేహాలను కనీసం కుటుంబ సభ్యులకు చూపించకుండా పోస్టుమార్టం కోసం తరలించారని తెలిపారు. ఎన్‌హెచ్‌ఆర్‌సీ నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని పౌరహక్కుల సంఘం న్యాయవాది పేర్కొన్నారు.
అయితే అడవిలో పోలీసుల భద్రత దృష్ట్యా మృతదేహాలను వెంటనే ములుగు ఆస్పత్రికి తరలించామని కోర్టుకు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. కాకతీయ మెడికల్ కళాశాలకు చెందిన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారన్నారు. ఈ ప్రక్రియను మొత్తం వీడియో తీశారని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఇరువురి వాదనలకు విన్న హైకోర్టు.. మృతదేహాలను రేపటి వరకు భద్రపరచాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. మృతదేహాలను కుటుంబ సభ్యులకు, బంధువులకు చూపించాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను రేపటికి (మంగళవారం) హైకోర్టు వాయిదా వేసింది.
కాగా.. ఏలూరు నాగారంలో మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై పౌరహక్కు సంఘం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. మావోయిస్టుల భోజనంలో విష ప్రయోగం జరిగందని హైకోర్టులో పౌర హక్కుల సంఘం పిటిషన్ దాఖలు చేసింది. పోలీసుల ఎన్‌కౌంటర్‌పై విచారణ జరపాలని.. వైద్య నిపుణుల సమక్షంలో పోస్ట్ మార్టం చేయాలని... పోస్ట్ మార్టం సమయంలో వీడియో రికార్డ్ చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.
భారీ ఎన్‌కౌంటర్...
ములుగు జిల్లా ఏటూరు నాగారం అడవుల్లో నిన్న(ఆదివారం) తెల్లవారుజామున జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో ఓ మహిళ సహా.. నర్సంపేట-ఇల్లందు ఏరియా కమిటీ కార్యదర్శి కుర్సం మంగు అలియాస్ భద్రు, ఏటూరునాగారం-మహాదేవ్‌పూర్ డివిజన్ కమిటీ కార్యదర్శి ఈగోలపు మల్లయ్య అలియాస్ మధు ఉన్నారు. వీరిలో మధు స్వస్థలం పెద్దపల్లి జిల్లా రాణాపూర్ కాగా.. మిగతా ఆరుగురు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారు. పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ -తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం, ఏటూరునాగారం అభయారణ్యాన్ని గ్రేహౌండ్స్, స్పెషల్‌పార్టీ పోలీసులు జల్లెడ పడుతున్నారు.
దటీజ్ ఆనంద్ మహీంద్రా! చడామడా విమర్శించిన నెటిజన్‌కు స్వీట్ సర్‌ప్రైజ్
ఈ క్రమంలో.. ఆదివారం ఉదయం 6.16 గంటల సమయంలో ఏటూరు నాగారం మండలం చెల్పాక-ఐలాపూర్ అభయారణ్యంలోని పోలకమ్మవాగు సమీపంలో నక్సల్స్ ఉన్నట్లు గుర్తించారు. ఇరువైపులా అరగంట పాటు కాల్పులు జరిగాయి. మావోయిస్టుల వైపు కాల్పులు ఆగిపోయిన కాసేపటికి.. పోలీసులు ఏడు మృతదేహాలను గుర్తించారు. మృతుల్లో భద్రు, మధుతోపాటు.. ఏరియా కమిటీ సభ్యులు ముస్సాకి దేవల్ అలియాస్ కర్ణాకర్, ముస్సాకి జమునలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మిగతా ముగ్గురిని దళసభ్యులు జైసింగ్, కిశోర్, కామేశ్‌గా భావిస్తున్నారు. ఘటనాస్థలిలో రెండు ఏకే-47 తుపాకులు, జీత్రీ, 303-రైఫిల్, ఇన్సాస్ తుపాకీ, ఎస్‌బీబీఎల్ గన్, సింగిల్‌షాట్ తుపాకీ, తపంచా, కిట్‌బ్యాగులు, విప్లవ సాహిత్యం, వంట సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి...
తుపాకీతో కాల్చుకుని ఎస్ ఆత్మహత్య
ఒడిదొడుకుల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇవే టాప్ 5 స్టాక్స్
Read Latest Telangana News And Telugu News