Manchu family: మంచు ఫ్యామిలీ గొడవ.. ఎఫ్‌ఐఆర్‌లో కీలక అంశాలు
ABN , Publish Date - Dec 10 , 2024 | 02:04 PM
Telangana: మంచు మనోజ్, మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుతో మనోజ్‌పైన 329(4)351(2)3(5) బీఎన్‌ఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. మనోజ్‌తో పాటు అతని సతీమణి మౌనిక రెడ్డిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుతో మరొక ఎఫ్‌ఐఆర్‌ను పోలీసులు నమోదు చేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 10: మంచు కుటుంబంలో గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. తనపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని.. తనకు, తన భార్యకు ప్రాణహాని ఉందని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌లో మంచు మనోజ్ (Manchu Manoj) నిన్న ( సోమవారం) ఫిర్యాదు చేశారు. అదే విధంగా మంచు మనోజ్‌తో తనకు ప్రాణహానీ ఉందంటూ మోహన్ బాబు (Manchu Mohan Babu) లేఖ ద్వారా రాచకొండ కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో.. మంచు మనోజ్, ఆయన భార్య మౌనికపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.
మోహన్‌బాబు ఫాంహౌస్ వద్ద ఉద్రిక్తత.. కొట్టుకున్న ఇరువర్గాలు
ఈ నేపథ్యంలో మంచు మనోజ్, మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుతో మనోజ్‌పైన 329(4)351(2)3(5) బీఎన్‌ఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. మనోజ్‌తో పాటు అతని సతీమణి మౌనిక రెడ్డిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుతో మరొక ఎఫ్‌ఐఆర్‌ను పోలీసులు నమోదు చేశారు. ఏబీఎన్-ఆంధ్రజ్యోతికి చిక్కిన ఈ రెండు ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు కీలక అంశాలు బయటకు వచ్చాయి.
మనోజ్ ఎఫ్‌ఐఆర్‌లో కీలక అంశాలు
విజయ్ రెడ్డి, కిరణ్ తో పాటు మరికొంత మందిని నిందితులుగా పోలీసులు చేర్చారు. గత ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో పది మంది వ్యక్తులు.. తనపై బెదిరింపులకు దిగారని మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఇంట్లోకి ప్రవేశించి తననే ఇంట్లో ఉండవద్దని గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. మనోజ్ షూటింగ్‌కు వెళ్లి ఉంటాడని భావించి, ఇంట్లోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు.. మనోజ్ భార్యను పిల్లలను చంపేస్తామని బెదిరింపులకు దిగారని ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు.
‘‘ఇక్కడ ఎందుకు ఉన్నారు అని బెదిరించి మనోజ్ భార్య పిల్లలను పరుగులు పెట్టించిన మోహన్ బాబు చెందిన వ్యక్తులు. వారిని పట్టుకునే క్రమంలో గొడవ జరిగింది. ఈ గొడవ సమయంలోనే మనోజ్‌కు గాయాలు అయినట్టు’’ ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు తెలిపారు. సీసీ ఫుటేజ్‌పై ఆరతీయగా.. విజయ్, కిరణ్ సీసీ ఫుటేజ్ మాయం చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. అలాగే మనోజ్ హాస్పిటల్ కు వెళ్ళాక సీసీ ఫుటేజ్ కూడా మాయం అయ్యింది. జరిగిన సంఘటనపై మీడియాలో ప్రసారం చేయవద్దు అని మీడియా ప్రతినిధులపై విజయ్ బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
మాతో పెట్టుకుంటే దబిడి దిబిడే.. వాళ్లకు కవిత మాస్
ఫైనల్‌గా విష్ణు కుటుంబం అక్కడే స్థిరపడుతుందా...
Read Latest Telangana News And Telugu News