Road Accidents: హైదరాబాద్‌లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు..
ABN , Publish Date - Dec 18 , 2024 | 09:55 AM
రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్ నగరంలోని బుధవారం తెల్లవారుజామున వేర్వేరు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఓ యువతి తీవ్రంగా గాయపడింది. మరోక వ్యక్తి తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్ (Hyderabad) నగరంలోని బుధవారం తెల్లవారుజామున వేర్వేరు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు (Road Accidents) జరిగాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఓ యువతి తీవ్రంగా గాయపడింది. మరోక వ్యక్తి తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే...
హైదరాబాద్ శివారు ప్రాంతాలలో రెండు హిట్ అండ్ రన్ కేసులు నమోదయ్యాయి. శివరాంపల్లి వద్ద పల్సర్ బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న యువకుడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో వాహనదారులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే యువకుడు కోమాలోకి వెళ్లిపోయాడు. దీంతో యువకుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
మరో ప్రమాదం.. శంషాబాద్ తొండుపల్లి వద్ద హోండా షైన్ బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. బైక్ పై తండ్రి, కూతుళ్లు ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువతి తండ్రి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ వెనుక కూర్చున్న ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. కళ్ల ముందే కన్న తండ్రి మృతి చెందడంతో కుమార్తె శృతి బోరున విల పించింది. మృతుడు శంషాబాద్ బహదూర్ గూడకు చెందిన కమ్మరి కుమార్‌గా గుర్తించారు. అతని మృతి ఆ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిపి ఫూటేజ్‌ను పరిశీలిస్తున్నారు.
మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ పట్టణంలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ యువకుడినీ కత్తులతో నరికి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు వేములవాడ రూరల్ మండలం, నూకలమర్రి గ్రామానికి చెందిన రషీద్ (35) గా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు గంగాధరలో డాక్యుమెంట్ రైటర్‌గా పని చేస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నకరేకల్లు డబుల్ మర్డర్ కేసులో వీడిన మిస్టరీ
గౌతులచ్చన్న విగ్రహావిష్కరణలో వెలుగులోకి కొత్త నిజాలు
కాంగ్రెస్ నేతలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విందు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News