Share News

Wines Close: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. రెండు రోజులు వైన్స్ బంద్

ABN , Publish Date - Sep 16 , 2024 | 08:12 PM

మందుబాబులకు బ్యాడ్ న్యూస్. సెప్టెంబర్ 17, 18 తేదీల్లో వైన్స్ బంద్ చెయ్యాలని సీపీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేసారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Wines Close: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. రెండు రోజులు వైన్స్ బంద్

హైదరాబాద్: మందుబాబులకు బ్యాడ్ న్యూస్. సెప్టెంబర్ 17, 18 తేదీల్లో వైన్స్ బంద్ చెయ్యాలని సీపీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేసారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో అన్ని రకాల మద్యం షాపులను(వైన్స్, కల్లు దుకాణాలు, బార్లు, బార్ అండ్ రెస్టారెంట్లు) మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు.


ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకోసం స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు, లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్‌ల అదనపు ఇన్‌స్పెక్టర్‌లకు అధికారం ఇవ్వనున్నారు. అయితే స్టార్ హోటల్ బార్‌లు, రిజిస్టర్ క్లబ్‌లకు ఈ ఆదేశాలు వర్తించవని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Traffic Jam: హుస్సేన్ సాగర్ చుట్టూ భారీ ట్రాఫిక్ జామ్.. 20 నిమిషాల ప్రయాణానికి గంట సమయం


For Latest News and National News click here

Updated Date - Sep 16 , 2024 | 08:12 PM