Hydra: బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో ‘హైడ్రా’ చర్యలు
ABN , Publish Date - Oct 10 , 2024 | 08:04 PM
గురువారం హైదరాబాద్‌లో హైడ్రా కార్యాలయంలో లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ మల్లిగవాడ్‌తో హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏ వీ రంగనాథ్ మాట్లాడుతూ.. చెరువుల పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిదని ఆయన స్పష్టం చేశారు. పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న కాలనీ, బస్తీ వాసులు, స్వచ్ఛంద, కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వ విభాగాలను భాగస్వామ్యం చేసి చెరువులను పునరుద్ధరించనున్నామన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 10: ప్రజలందరి భాగస్వామ్యంతోనే చెరువులకు పునరుజ్జీవనం కల్పిస్తామని హైడ్రా కమిషనర్ ఏ.వి.రంగనాథ్ స్పష్టం చేశారు. పర్యావరణానికి చెరువలే ఆదరువు అని స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణకు చెరువు తల్లి లాంటిదని ఆయన అభివర్ణించారు. తాగు, సాగు నీరందించే చెరువులు పట్టణీకరణతో ప్రభావాన్ని కోల్పోయాయన్నారు. చాలా చెరువులు కనుమరుగైతే.. ఉన్నవి కొన్ని మురికి కూపాలుగా మారాయని చెప్పారు. ప్రస్తుతం ఆ చెరువులకు పునరుజ్జీవనం ఇచ్చేందుకు హైడ్రా చర్యలు తీసుకుంటోందని ఏ.వి.రంగనాథ్ వెల్లడించారు.
Also Read: సాక్షి పత్రిక కథనాలపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
గురువారం హైదరాబాద్‌లో హైడ్రా కార్యాలయంలో లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ మల్లిగవాడ్‌తో హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏ వీ రంగనాథ్ మాట్లాడుతూ.. చెరువుల పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిదని ఆయన స్పష్టం చేశారు. పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న కాలనీ, బస్తీ వాసులు, స్వచ్ఛంద, కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వ విభాగాలను భాగస్వామ్యం చేసి చెరువులను పునరుద్ధరించనున్నామన్నారు.
Also Read: దసరా రోజు.. పాలపిట్టను ఎందుకు చూడాలంటే.. కారణాలు ఇవే?
హైదరాబాద్‌లోని హైడ్రా కార్యాలయం నుంచి నేరుగా బెంగళూరులో చెరువుల పునరుద్ధరణ జరిగిన తీరును కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఆ క్రమంలో బెంగళూరులో మురుగుతో, నీళ్లు లేకుండా ఉన్న వాటిని ఎలా మంచినీటి చెరువులుగా మార్చారో.. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఏవీ రంగనాథ్‌కు ఆనంద్ వివరించారు. అందులోభాగంగా బెంగళూరు మహానగంరలో మొత్తం 35 చెరువులను పునరుద్ధరించిన విధానాన్ని ఈ సందర్భంగా ఆనంద్ సోదాహరణగా తెలిపారు. అతి తక్కువ వ్యయంతో చెరువులకు పునరుజ్జీవనం కల్పించిన తీరును హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఆయన వివరించారు.
Also Read: సాహిత్యంలో హాన్ కాంగ్‌కు నోబెల్ పురస్కారం
పేరుకు పోయిన వ్యర్థాలను తొలగించి స్వచ్ఛమైన నీరు చెరువులోకి వెళ్లేలా ఏర్పాట్లు సైతం చేశారు. అలాగే మురుగు నీటి కాలువల నుంచే శుద్ధి చేసే ప్రక్రియను ప్రారంభించి.. చెరువులోకి చేరే ముందు మూడు నాలుగు దశల్లో నీరు ఉంచి ఫిల్టర్ చేసిన తీరును హైడ్రా అధికారులు ఈ సందర్బంగా ఆసక్తిగా గమనించారు. ఇక మురుగు నీటి కాలువలకు రెండు వైపులా మొక్కలు నాటడం, చెరువులోకి నీరు చేరే లోపే కొంత మేర శుద్ధి జరిగేలా బెంగళూరులో అమలు చేసిన విధానంపై క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేయాలని హైడ్రా అధికారులు నిర్ణయించారు.
Also Read: రతన్ టాటాకి ఘోర అవమానం జరిగినా..?
అలాగే ఆనంద్ మల్లిగవాడ్‌ను హైదరాబాద్‌కు పిలిపించి.. ఇక్కడ చెరువుల పునరుద్ధరణకు ఆయన సహాయం కోరనున్నట్లు హైడ్రా కమిషనర్ తెలిపారు. అదే విధంగా కూల్చివేతల వ్యర్ధాలను తొలగించి ముందుగా సున్నం చెరువు, అప్పా చెరువు, ప్రగతినగర్ వద్ద ఉన్న ఎర్రకుంట, కూకట్‌పల్లి చెరువులకు రక్షణ కల్పించాలని హైడ్రా నిర్ణయించింది. చెరువుల్లో శుద్ధ జలాలుంటే ఆయా పరిసరాలు చల్లగా ఉంటాయని హైడ్రా భావిస్తుంది.
Also Read: ప్రపంచ కుబేరుల జాబితాలో రతన్ టాటా ఎందుకు లేరంటే..?
ఏపుగా పెరిగిన మొక్కలతో చక్కటి పర్యావరణం స్థానికులకు అందుతుందన్నారు. అందుకే ఈ కార్యక్రమంలో స్థానికులను పెద్ద సంఖ్యలో భాగస్వామ్యం కల్పించి.. వారికే నిర్వహణ బాధ్యతలు స్వచ్ఛందంగా తీసుకునేలా కసరత్తు జరుగుతుందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వివరించారు.
Also Read: విలువ కట్టలేని రత్నాన్ని కోల్పోయిన భారత్
For More Telangana News and Telugu News..