Share News

HYDRA: 111.72 ఎకరాల భూమి స్వాధీనం

ABN , Publish Date - Sep 11 , 2024 | 08:39 PM

అక్రమణలకు గురైన ప్రభుత్వ భూములు, చెరువులను పరిరక్షించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్)ను ఏర్పాటు చేసింది. ఈ హైడ్రా రంగంలోకి దిగిన నెలల వ్యవధిలోనే వందల ఎకరాల ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.

HYDRA:   111.72 ఎకరాల భూమి స్వాధీనం

హైదరాబాద్, సెప్టెంబర్ 11: అక్రమణలకు గురైన ప్రభుత్వ భూములు, చెరువులను పరిరక్షించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్)ను ఏర్పాటు చేసింది. ఈ హైడ్రా రంగంలోకి దిగిన నెలల వ్యవధిలోనే వందల ఎకరాల ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.

Also Read: Himachal Pradesh: జూనియర్‌ని ర్యాగింగ్ చేసిన సీనియర్లు అరెస్ట్


గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు తెలిపింది. ఆ క్రమంలో 111.72 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా పేర్కొంది. అందుకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లు బుధవారం చెప్పింది. గత రెండు నెలల్లో ఏ ఏ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది ఆ నివేదికలో హైడ్రా స్పష్టం చేసింది.

Also Read: Kolkata: సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్‌పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం


రామ్‌నగర్‌ మణెమ్మ గల్లీలో 3, గగన్ పహాడ్‌ అప్పా చెరువులో 14, అమీన్‌పూర్‌ పెద్ద చెరువు పరిధిలో 24, దుండిగల్ కత్వా చెరువు పరిధిలో 13, మాదాపూర్ సున్నం చెరువులో 42 అక్రమ నిర్మాణాలను తొలగించినట్లు హైడ్రా వివరించింది. అమీన్‌పూర్‌లో అత్యధికంగా 51 ఎకరాలు, సున్నం చెరువు పరిధిలో 10 ఎకరాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆ నివేదికలో హైడ్రా పొందపరిచింది.

Also Read: Telugu States: వరద నష్టంపై నివేదిక అందజేత


గతేడాది చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటరు పట్టం కట్టారు. దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరంది. హైదరాబాద్ మహానగర పరిధిలో ప్రభుత్వ స్థలాల అక్రమ నిర్మాణాలపై ఉక్కు పాదం విధించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Also Read: Jammu and Kashmir: జైలు నుంచి విడుదలైన ఎంపీ ఇంజనీర్ రషీద్


అందులోభాగంగా హైడ్రాను ప్రభుత్వం తెరపైకి తీసుకు వచ్చింది. హైడ్రా కమిషనర్‌గా ఐపీఎస్ అధికారి రంగనాథ్‌ను నియమించింది. దీనికి ప్రత్యేక పోలీస్ సిబ్బందిని నియమించింది. 15 మంది సీఐలు, 8 మంది ఎస్ఐ స్థాయి పోలీస్ అధికారులు అక్రమణలు కూల్చివేసేందుకు పని చేస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: Sonia Gandhi: సోనియా గాంధీ నివాసం వద్ద సిక్కు సంఘాలు ఆందోళన

Read More National News and Latest Telugu New

Updated Date - Sep 11 , 2024 | 08:45 PM