Share News

Hyderabad: సీఎం రేవంత్ రెడ్డితో ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ భేటీ

ABN , Publish Date - Aug 22 , 2024 | 07:50 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇక్రిశాట్ ( ICRISAT) డైరెక్టర్ జనరల్ డాక్టర్ జాక్వెలిన్ హ్యూ ( Dr. Jacqueline Hughe) గురువారం సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా వివిధ రకాల పంటలకు సంబంధించి అధిక దిగుబడిని అందించే కొత్త వంగడాలపై పరిశోధనలు చేపట్టాలని ఈ సందర్భంగా డీజీ డాక్టర్ జాక్వెలిన్ హ్యూకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

Hyderabad: సీఎం రేవంత్ రెడ్డితో ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ భేటీ

Revanth-1.jpgహైదరాబాద్, ఆగస్ట్ 22: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇక్రిశాట్ ( ICRISAT) డైరెక్టర్ జనరల్ డాక్టర్ జాక్వెలిన్ హ్యూ ( Dr. Jacqueline Hughe) గురువారం సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా వివిధ రకాల పంటలకు సంబంధించి అధిక దిగుబడిని అందించే కొత్త వంగడాలపై పరిశోధనలు చేపట్టాలని ఈ సందర్భంగా డీజీ డాక్టర్ జాక్వెలిన్ హ్యూకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

revanth-2.jpg


తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధికి ఉపయోగపడేలా పరిశోధనలు ఉండాలని సీఎం రేవంత్ ఆకాంక్షించారు. ఇక్రిశాట్‌ను ఓ సారి సందర్శించాలంటూ జాక్వెలిన్ చేసిన విజ్ఞప్తిపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. సాధ్యమైనంత త్వరలో ఇక్రిశాట్‌ను సందర్శిస్తానని డీజీ డాక్టర్ జాక్వెలిన్‌కు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

revanth-0.jpg

Updated Date - Aug 22 , 2024 | 07:50 PM