Share News

CM Revanth Reddy: ఐఐహెచ్‌టీని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Sep 09 , 2024 | 02:12 PM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ (సోమవారం) నాంపల్లిలో ఐఐహెచ్‌టీ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ) వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐఐహెచ్‌టీని ప్రారంభించడం సంతోషకరమని అన్నారు. తెలంగాణ విద్యార్థులు ఏపీ, ఒడిశా రాష్ట్రాలకు వెళ్లి హ్యాండ్లూమ్ కోర్సులు చదవాల్సి వస్తోందని అన్నారు.

CM Revanth Reddy: ఐఐహెచ్‌టీని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. కీలక వ్యాఖ్యలు
Revanth Reddy

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ (సోమవారం) నాంపల్లిలో ఐఐహెచ్‌టీ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ) వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐఐహెచ్‌టీని ప్రారంభించడం సంతోషకరమని అన్నారు. తెలంగాణ విద్యార్థులు ఏపీ, ఒడిశా రాష్ట్రాలకు వెళ్లి హ్యాండ్లూమ్ కోర్సులు చదవాల్సి వస్తోందని అన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో మాట్లాడి ఐఐహెచ్‌టీకి అనుమతులు తెచుకున్నామని ఈ సందర్భంగా వెల్లడించారు. విద్యార్థుల సమయం వృథా కాకూడదని, తెలుగు యూనివర్శిటీలో ఐఐహెచ్‌టీలో ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభిస్తామని చెప్పారు. వచ్చే ఏడాది ఐఐహెచ్‌టీని స్కిల్ యూనివర్సిటీకి తరలిస్తామని చెప్పారు. ఒక్కో విద్యార్థికి నెలకు 2500 స్టై ఫండ్ ఇస్తామని హామీ ఇచ్చారు.


‘‘గతంలో సినీ తళుకు బెళుకులు కూడా చేనేతకి తెచ్చారు. కానీ నేతన్నల రాత మారలేదు. గతంలో సిరిసిల్లలో కార్మికులకు బకాయిలు పెట్టారు. ఆ మొత్తం మేము అధికారంలోకి వచ్చాక విడుదల చేశాం. బతుకమ్మ చీరలకు కట్టుకునే స్థాయిలో నాణ్యత లేవు. మంచి డిజైన్‌తో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు ఒక్కొక్కరి ఏడాదికి 2 చీరలు ఇస్తాం. బతుకమ్మ చీరలు ఆగిపోయాయని ఆలోంచాల్సిన అవసరం లేదు’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.


నేతన్నలకు రుణమాఫీ ఇస్తున్నాం

నేతన్నలకు రుణమాఫీ ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రుణమాఫీకి ఇప్పుడే ఆదేశాలు ఇస్తున్నామని అన్నారు. ‘‘ మీ సమస్యల పరిష్కారానికి మీ అన్నగా ఎప్పుడు ముందు ఉంటా. కొడంగల్ నియోజక వర్గంలోని నేతన్నలతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. నేతన్న కొండా లక్ష్మణ్ బాపూజీ వారసులు. త్యాగాలు చేస్తే ఎలా వేలాది కోట్ల ఆస్తులు సంపాదించారు. పదవిని తృణప్రాయంగా త్యాగం చేసింది కొండా లక్ష్మణ్ బాపూజీ’’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఐఐహెచ్‌టీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.


రైతన్న, నేతన్నలకు అత్యంత ప్రాధాన్యత: మంత్రి తుమ్మల

రైతన్న, నేతన్నలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ‘‘ చేనేత సమస్యలకు సాంకేతికతే ముఖ్య కారణం. చేనేత ఉత్పత్తులు ప్రపంచానికి ఎగుమతులు కావాలి. అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. మన పిల్లలకు మన నైపుణ్యం అందించేందుకు ఐఐహెచ్‌టీ ఏర్పాటు చేస్తాం. అతి తక్కువ సమయంలో కేవలం 10 రోజుల్లోనే ఐఐహెచ్‌టీ ఏర్పాటు చేశాం. ప్రస్తుతానికి ఐఐహెచ్‌టీ తరగతులు తెలుగు వర్సిటీలో అందిస్తున్నాం. త్వరలో ఐఐహెచ్‌టీని స్కిల్ వర్శిటీకి తరలింపు. నేతన్నల సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు కృషి. చిన్న వయస్సులోనే రేవంత్ సీఎం అయ్యారు. అన్ని వర్గాలకు న్యాయం చేయాలని కృషి చేస్తున్నారు’’ అని అన్నారు.

Updated Date - Sep 09 , 2024 | 02:16 PM