Share News

అతివకు చోటేదీ!?

ABN , Publish Date - May 01 , 2024 | 06:11 AM

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ నుంచి పార్లమెంటులో అడుగు పెట్టిన మహిళా ఎంపీలు కేవలం ఇద్దరే ఇద్దరు! 2014లో కల్వకుంట్ల కవిత! 2019లో మాలోతు కవిత! ఒక్కో ఎన్నికలో ఒక్కొక్కరు మాత్రమే గెలిచి లోక్‌సభకు వెళ్లారు! మరి, అంతకు ముందు పరిస్థితి ఏమిటి!?

అతివకు చోటేదీ!?

మహిళలను లోక్‌సభకు పంపిన నిజయోజకవర్గాలు ఇవ్వే !

వరంగల్

సికింద్రాబాద్

ఖమ్మం

నిజామాబాద్

మెదక్

పెద్దపల్లి

మహబూబ్ నగర్

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ నుంచి పార్లమెంటులో అడుగు పెట్టిన మహిళా ఎంపీలు కేవలం ఇద్దరే ఇద్దరు! 2014లో కల్వకుంట్ల కవిత! 2019లో మాలోతు కవిత! ఒక్కో ఎన్నికలో ఒక్కొక్కరు మాత్రమే గెలిచి లోక్‌సభకు వెళ్లారు! మరి, అంతకు ముందు పరిస్థితి ఏమిటి!?

తెలంగాణలోని ఏ నియోజకవర్గాలు కనీసం ఒక్కసారైనా మహిళలను లోక్‌సభకు పంపాయి!? ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా మహిళలను గెలిపించని నియోజకవర్గాలు ఏవి!? ఈ ప్రశ్నలకు సమాధానం ఆసక్తికరం.

ప్రస్తుతం ఉన్న వాటిలో ఏకంగా పది నియోజకవర్గాల నుంచి కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా మహిళలు పార్లమెంటుకు వెళ్లలేదు. కేవలం ఏడు నియోజకవర్గాల నుంచి ఒకరో ఇద్దరో గెలిచారు. అంటే.. కనీసం సగం నియోజకవర్గాల నుంచి కూడా మహిళా ప్రాతినిధ్యం లేదన్నమాట! ఇంకా చెప్పాలంటే.. కొన్ని నియోజకవర్గాల్లో ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటి వరకూ మహిళలకు పోటీ చేయడానికి అవకాశం కూడా ఇవ్వలేదు! కరీంనగర్‌ పార్లమెంటులో 1952లో కాంగ్రెస్‌ పార్టీ టీఎన్‌ సదాలక్ష్మికి టికెట్‌ ఇచ్చింది.

ఆమె పరాజయం పాలయ్యారు. కానీ, ఆనాటి నుంచి ఈనాటి వరకూ ఏ ప్రధాన పార్టీ మహిళలకు మళ్లీ అవకాశం కల్పించలేదు.

లోక్‌సభలో అధ్యక్షా అనే అవకాశం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క మహిళా నేతకూ దక్కలేదు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్వపు నల్లగొండ, మిర్యాలగూడ స్థానాల నుంచి గానీ, ప్రస్తుతం ఉన్న నల్లగొండ, భువనగిరి లోక్‌సభ నియోజకవర్గాల నుంచి గానీ మహిళా నేతలకు లోక్‌సభకు వెళ్లే అవకాశం రాలేదు. సీపీఎం నుంచి 1996 ఎన్నికల్లో మిర్యాలగూడ స్థానం నుంచి తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు మల్లు స్వరాజ్యం పోటీ చేసి ద్వితీయ స్థానంలో నిలిచారే తప్ప విజయం సాధించలేకపోయారు.

నల్లగొండ లోక్‌సభ నుంచి ప్రజారాజ్యం పార్టీ తరపున 2009 ఎన్నికల్లో మల్లు స్వరాజ్యం తనయ పాదూరి కరుణ పోటీ చేసి, గణనీయమైన ఓట్లు సాధించారే తప్ప గెలుపుని అందుకోలేకపోయారు.

గత ఎన్నికల్లో సీపీఎం నుంచి మల్లు స్వరాజ్యం కోడలు లక్ష్మి పోటీ చేసినా విజయం దక్కలేదు. ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గమైన నాగర్‌ కర్నూలులో 2019లో బంగారు శ్రుతికి అవకాశం వచ్చినా.. గెలవలేదు.

- నల్లగొండ, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌ - ఆంధ్రజ్యోతి

ఇప్పటి వరకూ మహిళా ప్రాతినిధ్యం లేని నియోజకవర్గాలు

  • ఆదిలాబాద్‌ మహబూబ్‌నగర్‌ భువనగిరి

  • కరీంనగర్‌ హైదరాబాద్‌ మల్కాజిగిరి

  • హన్మకొండ నాగర్‌కర్నూలు చేవెళ్ల, జహీరాబాద్‌

Updated Date - May 01 , 2024 | 07:35 AM