JC Diwakar Reddy: జేసీ దివాకర్ రెడ్డి సంతకాలు ఫోర్జరీ
ABN , Publish Date - May 29 , 2024 | 10:28 AM
ఏకంగా మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సంతకాలనే కొందరు ఫోర్జరీ చేశారు. ఈ ఘటనలో సాహితీ లక్ష్మీనారాయణతో పాటు కొడుకు సాత్విక్ తదితరులపై ఫోర్జరీ కేసు నమోదైంది. జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 62 లో ఉన్న దివాకర్ రెడ్డి ఇంటిని సాహితీ లక్ష్మీనారాయణ అద్దెకు తీసుకున్నారు. మూడేళ్ల గడువు ముగిసినా ఖాళీ చేయకుండా వేధింపులకు పాల్పడుతున్నారు.
అనంతపురం: మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సంతకాలనే ఫోర్జరీ చేసి కోర్టు మెట్లెక్కారు. ఇంతటి దుస్సాహసం ఎవరైనా చేస్తారా? అంటే చేశారు. ఎవరి సంతకాలైనా ఫోర్జరీ చేయవచ్చు కానీ కోర్టుకు వెళ్లడమే పరాకాష్ట. జేసీ దివాకర్ రెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసిన ఘటనలో సాహితీ లక్ష్మీనారాయణతో పాటు కొడుకు సాత్విక్ తదితరులపై ఫోర్జరీ కేసు నమోదైంది.
TS News: ఉప్పల్లో గంజాయి బ్యాచ్ హల్చల్..
జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 62 లో ఉన్న దివాకర్ రెడ్డి ఇంటిని సాహితీ లక్ష్మీనారాయణ అద్దెకు తీసుకున్నారు. మూడేళ్ల గడువు ముగిసినా ఖాళీ చేయకుండా వేధింపులకు పాల్పడుతున్నారు. కోర్టులో జేసీ దివాకర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. జేసీ దివాకర్ రెడ్డి సంతకాలు ఫోర్జరీ చేసి లక్ష్మీనారాయణ కొడుకు సాత్విక్, న్యాయవాది కోర్టులో వేశారు. జూబ్లీ హిల్స్ పోలీసులకు జేసీ దివాకర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Hyderabad: పోలింగ్ రోజున.. తగ్గిన పొల్యూషన్
Read Latest Telangana News and National News