ప్రశ్నించే తత్వమే కవి లక్షణం: జూకంటి
ABN , Publish Date - Jul 22 , 2024 | 02:47 AM
‘కన్నీటి చెమ్మను కదిలించలేని కవిత్వాన్ని నేను ఊహించలేను. మనిషి వినియోగదారుడై.. కేవలం వస్తువుగా రూపమెత్తినపుడు.. ప్రశ్నలు పోగొట్టుకొని తలవంచుకొని నిలబడటం కవి, కవిత్వ లక్షణం కాదు’ అని ప్రముఖ కవి జూకంటి జగన్నాథం పేర్కొన్నారు.
సిరిసిల్ల, జూలై 21 (ఆంధ్రజ్యోతి): ‘కన్నీటి చెమ్మను కదిలించలేని కవిత్వాన్ని నేను ఊహించలేను. మనిషి వినియోగదారుడై.. కేవలం వస్తువుగా రూపమెత్తినపుడు.. ప్రశ్నలు పోగొట్టుకొని తలవంచుకొని నిలబడటం కవి, కవిత్వ లక్షణం కాదు’ అని ప్రముఖ కవి జూకంటి జగన్నాథం పేర్కొన్నారు. నేటి కవిత్వం వర్తమానంలో ప్రజల పక్షంలో నిలబడలేక బాల్యంలోకి పోతోందని అన్నారు. మహాకవి దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా సోమవారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జూకంటి.. దాశరథి అవార్డును అందుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించడం తన సాహిత్య జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టమని తెలిపారు.