పర్యాటక ప్రాంతాల అభివృద్ధి: మంత్రి జూపల్లి
ABN , Publish Date - Sep 23 , 2024 | 05:19 AM
తెలంగాణకు దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పర్యాటక ప్రాంతాలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.
హైదరాబాద్, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పర్యాటక ప్రాంతాలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ-హైదరాబాద్ బైక్‌రైడర్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం బేగంపేట ప్లాజాలో ‘రైడ్‌టు నిర్వాణ-బుద్ధవనం’ బైక్ ర్యాలీని మంత్రి జూపల్లి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగార్జునసాగర్‌లో బౌద్ధ వారసత్వాన్ని నేటి తరానికి పరిచయం చేయడానికి అన్ని హంగులతో బుద్ధవనం ప్రాజెక్టును ప్రభుత్వం నిర్మించిందని చెప్పారు. అనంతరం టూరిజం ప్లాజా నుంచి తార్నాక వరకు మంత్రి జూపల్లి బైక్ నడిపి బైకర్స్‌లో ఉత్సాహాన్ని నింపారు.