Keshava Rao: నేడు రాజ్యసభ పదవికి కేకే రాజీనామా
ABN , Publish Date - Jul 04 , 2024 | 12:37 PM
కాంగ్రెస్ నేత కే కేశవరావు(K Keshava Rao) గురువారం తన రాజ్యసభ పదవికి రాజీనామా చేయనున్నారు. బుధవారమే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన రాజ్యసభ పదవికి రాజీనామా చేస్తానని గతంలోనే చెప్పారు..
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత కే కేశవరావు(K Keshava Rao) గురువారం తన రాజ్యసభ పదవికి రాజీనామా చేయనున్నారు. బుధవారం నాడు కేకే కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత తన రాజ్యసభ పదవికి రాజీనామా చేస్తానని గతంలోనే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ మధ్యాహ్నం 01:15 గంటలకు రాజ్యసభ ఛైర్మన్, ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్‌ని కలిసి రాజీనామా లేఖను సమర్పించనున్నారు.
బుధవారం ఢిల్లీలోని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మల్లికార్జున ఖర్గే సమక్షంలో కేకే పార్టీలో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపదాస్ మున్షీ, సీనియర్ నేత కేసీ వేణుగోపాల్, మధు యాష్కీ గౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
For Latest News and National News click here