సమగ్ర సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి
ABN , Publish Date - Nov 12 , 2024 | 12:36 AM
సమగ్ర కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ప్రత్యేకాధికారి ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. మండలంలోని చెంజర్లలో నిర్వహిస్తున్న సర్వేను సోమవారం ఆయన పరిశీలించారు.
మానకొండూర్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): సమగ్ర కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ప్రత్యేకాధికారి ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. మండలంలోని చెంజర్లలో నిర్వహిస్తున్న సర్వేను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్యూమరేట్లు గ్రామాల్లో స్టిక్కర్ వేసిన ప్రతి ఇంటికి వెళ్లి సమాచారాన్ని నమోదు చేయాలన్నారు. ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు అంకితాభావంతో పని చేసి సర్వేనే పూర్తి చేయాలని అఽధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీవో వరలక్ష్మి, ఎంపీవో కిరణ్‌కుమార్, పంచాయితీ కార్యదర్శి శ్రీకాంత్ ఉన్నారు.
ఫ తిమ్మాపూర్: సమగ్ర సర్వేను నిర్దిష్ట వ్యవధిలోగా పూర్తి చేయాలని జిల్లా ప్రత్యేక అధికారి ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. అలుగునూర్‌లోని పలు నివాస గృహాల్లో సర్వే జరుగుతున్న తీరును ఆర్వీ కర్ణన్, కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి పరిశీలించారు. సర్వే చేస్తున్న ఎన్యూమరేటర్లు, సూపర్‌వుజర్లతో ఆయన మాట్లాడారు. కుటుంబ సభ్యులు అందుబాటులో ఉన్న సమయంలో సర్వే చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయి, మెప్మా పీడీ స్వరూపారాణి పాల్గొన్నారు.
శంకరపట్నం: మండలంలోని వంకాయగూడెంలో సమగ్ర సర్వేను ఆర్వీ కర్ణన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కుటుంబ ఆర్థిక స్థితిగతులు, కుటుంబ సభ్యుల సంఖ్య, ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ యజమానితో మాట్లాడి సర్వే వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఫ ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన
కేశవపట్నం వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం జిల్లా ప్రత్యేకాధికారి ఆర్వీ కర్ణన్ పరిశీలించారు. సన్నరకం వరిధాన్యంపై వివరాలు అడిగారు. వరిధాన్యం కొనుగోళ్లపై రైతులతో మాట్లాడారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను పౌరసరఫరాల అధికారిని అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోళ్లలో సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు.