Share News

ఇంటింటి సర్వేను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలి

ABN , Publish Date - Oct 31 , 2024 | 12:15 AM

జిల్లాలో నిర్వహించే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను అధికారులు ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ సూచించారు. బుధవారం మల్లాపూర్‌ ప్రజాపరిషత్‌ కార్యాలయంలో సమగ్ర కుటుంబ సర్వేపై అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు, పం చాయతీ కార్యదర్శులకు అవగాహన సదస్సును నిర్వహించారు.

ఇంటింటి సర్వేను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలి
మల్లాపూర్‌లో అవగాహన కల్పిస్తున్న కలెక్టర్‌ సత్యప్రసాద్‌

- కలెక్టర్‌ సత్యప్రసాద్‌

మల్లాపూర్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నిర్వహించే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను అధికారులు ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ సూచించారు. బుధవారం మల్లాపూర్‌ ప్రజాపరిషత్‌ కార్యాలయంలో సమగ్ర కుటుంబ సర్వేపై అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు, పం చాయతీ కార్యదర్శులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబరు 1 నుంచి చేపట్టే కుటుంబ సమగ్ర సర్వేలోని పత్రంలో 56 ప్రశ్నలతో కూడి ఉంటుందన్నారు. ప్రభు త్వ ఆదేశాలతో ఇచ్చిన బుక్‌లెట్‌ ఆధారంగా కోడ్‌ పద్ధతి తో కుటుంబ నిర్ధారణ వివరాలు నమోదు చేపట్టాలన్నా రు. సర్వే చేస్తున్న సమయంలో కుటుంబ సభ్యుల ఆధార్‌కార్డు, రేషన్‌ కార్డు, ధరణి పాసు పుస్తకాలు, ఆరోగ్య వివరాలు, యజమాని నుంచి సరైన వివరాలు తెలుసుకునేందుకు సంబంధించిన పత్రాలు సర్వే చేసే వారికి తెలియజేశాల ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కుటుంబసర్వేలో ఇచ్చిన వివరాలు గోప్యం గా ఉంచుతామని, నింపిన షెడ్యూల్‌ ఫారాలను జాగ్రత్త గా భద్రపరచాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్‌, డీఆర్‌డీవో రఘువరన్‌, తహసీల్దార్‌ వీర్‌సింగ్‌, ఎంపీడీవో, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 31 , 2024 | 12:15 AM