ఉధృతంగా వరద కాలువ
ABN , Publish Date - Sep 15 , 2024 | 11:49 PM
గంగాధర మండల పరిధిలో వరద కాలువ ఉదృతంగా ప్రవహిస్తోంది. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నుంచి 19 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో వరద కాలువలో నీరు బ్రిడ్జి అంచులను తాకుతూ ప్రవహించింది.
గంగాధర, సెప్టెంబరు 15: గంగాధర మండల పరిధిలో వరద కాలువ ఉదృతంగా ప్రవహిస్తోంది. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నుంచి 19 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో వరద కాలువలో నీరు బ్రిడ్జి అంచులను తాకుతూ ప్రవహించింది. మండలంలోని ర్యాలపల్లి, కొండయ్యపల్లి, బూరుగుపల్లి, నాగిరెడ్డిపూర్, కొండన్నపల్లి, రంగరావుపల్లి, తాడిజెర్రి, గర్షకుర్తి, ఆచంపల్లి గ్రామాల్లో వరద కాలువ నిండుగా ప్రవహిస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాలు పెరిగి సాగు నీటికి ఇబ్బందులు తొలగుతాయని రైతులు అన్నారు.
నేడు ఎల్‌ఎండీ నుంచి నీటి విడుదల
తిమ్మాపూర్: దిగువ మానేరు రిజర్వాయర్ (ఎల్‌ఎండి)లో నీటి నిలవలు పూర్తిస్థాయికి చేరడంతో సోమవారం ఉదయం 9 గంటలకు గేట్లు పైకి ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నట్లు ఎస్సారెస్పీ ఈఈ పి నాగభూషణరావు ఒక ప్రకటనలో తెలిపారు. డ్యాం నుంచి ఐదు వేల క్యూసెక్కుల నీటిని మానేరు నదిలోకి వదలాలని నిర్ణయించినట్లు తెలిపారు. రెవెన్యూ, పోలీసు అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని, గ్రామాల్లో దండోరా వేయించాలని సూచించారు. నదీ పరివాహక ప్రాంతాల్లోకి పశువులు, గొర్రెలు, మేకలు వెళ్లకుండా చూసుకోవాలని, చేపలుపట్టేవారు, గొర్రె కాపరులు, రైతులు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు.