Share News

ఆర్వీఎం క్లాత్‌ ఉత్పత్తిపై సమీక్ష

ABN , Publish Date - Jan 03 , 2024 | 11:30 PM

సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమకు ఈ సంవత్సరం కూడా పాఠశాలల పిల్లలకు అందించే యూనిఫాం క్లాత్‌కు సంబంధించిన ఉత్పత్తిపై చేనేత జౌళి శాఖ అధికారులు బుధవారం సిరిసిల్ల టెక్స్‌టైల్‌ పార్కులో పారిశ్రామికులు, సైజింగ్‌ యజమానులతో సమీక్షించారు.

 ఆర్వీఎం క్లాత్‌ ఉత్పత్తిపై సమీక్ష
సమావేశంలో మాట్లాడుతున్న హిమజ్‌కుమార్‌

- సిరిసిల్లకు కోటి మీటర్ల ఆర్డర్లు

సిరిసిల్ల, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమకు ఈ సంవత్సరం కూడా పాఠశాలల పిల్లలకు అందించే యూనిఫాం క్లాత్‌కు సంబంధించిన ఉత్పత్తిపై చేనేత జౌళి శాఖ అధికారులు బుధవారం సిరిసిల్ల టెక్స్‌టైల్‌ పార్కులో పారిశ్రామికులు, సైజింగ్‌ యజమానులతో సమీక్షించారు. ఈ సారి టెస్కో ద్వారా అందించే ఆర్వీఎం బట్ట ఆర్డర్లలో మార్పులు తీసుకొచ్చారు. గతంలో షర్టింగ్‌ క్లాత్‌ను తయారు చేసి ప్రింటింగ్‌కు పంపించేవారు. ఈసారి టెక్స్‌టైల్‌ పార్కులో నేరుగా డిజైన్‌తోనే ఉత్పత్తి చేయనున్నారు. 50 శాతం కాటన్‌దారం వాడనున్నారు. షర్టింగ్‌, షూటింగ్‌కు సంబంధించి కోటి మీటర్ల వరకు ఆర్డర్లు రానున్నాయి. ఇందుకు సంబంధించిన విధి విధానాలపై టెస్కో టెక్నికల్‌ అడ్మినిస్ర్టేటర్‌ ఓఎస్‌ఎడీ హిమజ్‌కుమార్‌ పలు సూచనలు చేశారు. సమావేశంలో డీడీ అశోక్‌కుమార్‌, ఏడీ సాగర్‌, టెక్స్‌టైల్‌ పార్కు అసోసియేషన్‌ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 03 , 2024 | 11:30 PM