Share News

తాగునీటి సమస్య లేకుండా చర్యలు

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:07 AM

తాగునీటి సమస్య లేకుం డా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అధికా రులకు సూచించారు.

తాగునీటి సమస్య లేకుండా చర్యలు

ధర్మారం, మార్చి 28: తాగునీటి సమస్య లేకుం డా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అధికా రులకు సూచించారు. గురువారం మండలంలోని మల్లాపూర్‌ ఎస్సీ కాలనీలో ఆయన సమస్యలను తెలుసుకున్నారు. ఎస్సీ కాలనీలో తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని అక్కడి మహిళలు ప్రభుత్వ విప్‌కు విన్నవించారు. స్పందించిన ప్రభు త్వ విప్‌ కాలనీలో తాగునీటి సమస్య తీర్చడం కోసం బోర్‌వెల్‌ మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పా రు. గ్రామంలో ఏదేని సమస్య ఉంటే తన దృష్టికి తీసుకువస్తే సమస్య పరిష్కరిస్తానని ఆయన తెలి పారు. వెంట గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, మహేందర్‌, మహిపాల్‌, దేవేందర్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.

ఎల్లంపల్లి పైపులైన్‌ ద్వారా పంటలకు సాగునీరు..

ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ నుంచి నిర్మించిన రెండు పైపులైన్ల ద్వారా పంటలకు సాగునీరు అందిస్తు న్నట్టు ప్రభుత్వ విప్‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ తెలిపారు. గురువారం మండలం లోని మల్లాపూర్‌ వద్దగల ఎల్లంపల్లి పైపులైన్‌ ఎయిర్‌వాల్వ్‌ను ఆయన ఓపెన్‌చేసి సాగునీటిని విడుదల చేశారు. రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోకుండా ప్రత్యామ్నాయంగా ఎల్లంపల్లి పైపులైన్‌ ద్వారా సాగునీటిని అందించుటకు ప్రభు త్వం చర్యలు తీసుకుందని చెప్పారు. పాలకుర్తి మండలం వేమునూర్‌ వద్దగల ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ పంప్‌హౌస్‌ నుంచి రెండు పైపులైన్ల ద్వారా నంది మేడారంలోని నంది రిజర్వాయర్‌లోకి చేరిన తర్వాత అక్కడి నుంచి చెరువులు కుంటలతో పాటు పంట పొలాలకు సాగునీరు అందుతుం దని ఆయన వివరించారు. ఈ విధంగా పైపులైన్‌ ద్వారా సాగునీటి విడుదల చేయడం వలన పంట లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయ న తెలిపారు. ఈ పైప్‌లైన్‌ ద్వారా ఉమ్మడి కరీంన గర్‌ జిల్లాలోని గంగాధర మండలం నారాయణ పూర్‌ చెరువు ద్వారా పలు చెరువుల్లోకి నీరు చేరు తుందని ఆయన వివరించారు. సంబంధిత అధికా రులు నీటి విడుదలను ఎప్పటికప్పుడు పరిశీ లిస్తూ పంటలకు సాగునీరు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఆయన వెంట కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీటీసీ మహేం దర్‌, రైతులు ఉన్నారు.

Updated Date - Mar 29 , 2024 | 12:07 AM