చదరంగం ఆటతో చురుకుదనం..
ABN , Publish Date - Dec 23 , 2024 | 01:32 AM
చదరంగం ఆడడం ద్వారా చురుకుదనం పెరిగి అన్ని రంగాల్లో రాణించవచ్చని జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి వై సురేష్ అన్నారు.
సుల్తానాబాద్, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : చదరంగం ఆడడం ద్వారా చురుకుదనం పెరిగి అన్ని రంగాల్లో రాణించవచ్చని జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి వై సురేష్ అన్నారు. సుల్తానాబాద్‌లోని శ్రీవాణి జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి సీఎం కప్ చదరంగ పోటీలను డీవై ఎస్‌వో సురేష్, చెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గడ్డాల శ్రీనివాస్‌తో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డీవైఎస్‌వో సురేష్ మాట్లాడుతూ ఎదుగుదలకు తోడ్పాటునందించే చెస్‌ను కేరీర్‌గా ఎంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్భిట్ రామయ్య, శ్రీవాణి కళాశాల ప్రిన్సిపాల్ మండారి కమలాకర్, పురెళ్ల సదానందం, పెటా జిల్లా కార్యదర్శి దాసరి రమే ష్, పల్లా అనిల్ ప్రణయ్, జావిద్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.