సమగ్ర ఇంటింటి సర్వేకు ప్రజలందరూ సహకరించాలి
ABN , Publish Date - Nov 08 , 2024 | 12:16 AM
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి న ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలందరూ సహకరించా లని కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు.
మంథని, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి న ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలందరూ సహకరించా లని కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు. మండలంలోని ఆరెంద, అడవి సోమన్‌పల్లి గ్రామాల్లో కలెక్టర్ శ్రీహర్ష గురువారం పర్యటించారు. ఆరెందలో జరుగుతున్న ఇంటింటి సర్వే తీరును, జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. అనంతరం అడవిసోమన్‌పల్లి గ్రామశివారులోని సర్వేనంబరు 192లో కోకా కోలా కంపెనీ యూ నిట్ స్థాపన కోసం 80 ఎకరాల స్థలాన్ని టీజీఐఐసీ వైస్ చైర్మన్ ఎండీ విష్ణువర్దన్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. సర్వేకు వచ్చే ఎన్యూ మరేటర్లకు తమకు కేటాయించిన ఇండ్లను సందర్శించి ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా పకడ్బందీగా సర్వే జరపాలన్నారు. ఆరెంద ప్రభుత్వ పాఠశాలకు దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల జాబితా ఇస్తే విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసే విధం గా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట ఆర్డీవో సురేష్, తహసీల్దార్ రాజయ్య, టీజీ ఐఐసీ చీఫ్ ఇంజనీర్ వినోద్‌కుమార్, జోనల్ మేనేజర్ పద్మజ, డిప్యూటీ జెడ్‌ఎం మహేశ్వర్, హెచ్‌ఎం శ్రీలతలు ఉన్నారు.