వ్యాపారులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా..
ABN , Publish Date - Dec 23 , 2024 | 01:35 AM
వ్యాపారస్తులకు ఎల్లవే ళలా అందుబాటులో ఉంటానని ఎ మ్మెల్యే చింతకుంట విజయరమణా రావు అన్నారు.
పెద్దపల్లిటౌన్, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : వ్యాపారస్తులకు ఎల్లవే ళలా అందుబాటులో ఉంటానని ఎ మ్మెల్యే చింతకుంట విజయరమణా రావు అన్నారు. చాంబర్ ఆఫ్ కామ ర్స్ కార్యాలయాన్ని ఆదివారం ఆయ న ప్రారంభించారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ చాంబ ర్ కామర్స్ కార్యాలయానికి రెండు గుంటల స్థలం ఇవ్వడంతో భవనం నిర్మించేం దుకు చర్యలు తీసుకుంటామన్నారు. వ్యాపార స్తులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవ లందిస్తామనని హామీఇచ్చారు. హోటళ్ళు, పాన్ షాపులు రాత్ర్లి 11గంటల వరకు తెరిచి ఉంచేం దుకు డీసీపీతో చర్చిస్తానన్నారు. ఈ కార్యక్ర మంలో అధ్యక్షుడు కమల్ కిషోర్, జనరల్ సెక్రె టరీ సయ్యద్ మస్రత్, కోశాధికారి జయప్రకాష్, వినోద్‌కుమార్, పరమేష్, నర్సింగరావు, గంగుల రవి, ప్రకాష్, శ్రీనివాస్, బాలకిషన్ జకోటియ, ఎంఏ మోయుద్, పైడా లక్ష్మయ్య, పట్టణానికి చెందిన పలువురు వ్యాపారులు పాల్గొన్నారు.