అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి
ABN , Publish Date - Dec 22 , 2024 | 01:37 AM
అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని జాతీయ ఎస్‌సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రాంచందర్ అన్నారు.
గోదావరిఖని, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని జాతీయ ఎస్‌సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రాంచందర్ అన్నారు. గోదావరిఖని జీఎం ఆఫీస్ వద్ద భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని శనివారం ఘనంగా ఆవిష్కరించారు. ఎస్‌సీ, ఎస్‌టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆవిర్భవించి 42సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమాని కి ముఖ్య అతిథులుగా జాతీయ ఎస్‌సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రాంచందర్, రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు రేణి కుంట్ల ప్రవీణ్ హాజరై అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా జీఎం కార్యాలయ ఆవరణలో జరిగిన సభలో వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను కొన సాగించాలన్నారు. ఈ సందర్భంగా కమిషన్ పరిధి హక్కు ల గురించి వివరించారు. ఏరియా ఉపాధ్యక్షులు జనగామ నరసయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్‌జీ-1 జీఎం డీ లలిత్ కుమార్‌తోపాటు అధికారులు, అసోసియే షన్ అధ్యక్షులు యాట ఓదెలు, చీఫ్ అడ్వైజర్ పులిమోహ న్, జనరల్ సెక్రెటరీ గంగారపు లింగమూర్తి, డిప్యూటీ జన రల్ సెక్రెటరీ ఆరెపల్లి రామచందర్, నాయకులు బడికెల కృష్ణ, నాతరి రాయమల్లు, రమేష్, ప్రవీణ్ కుమార్, దేవ య్య, రాజశేఖర్, శంకర్, రాజలింగు, తిరుపతి, ఉమేందర్, రమేష్, ముడుసు రమేష్, కళ్యాణ్, అశోక్, కుమార్ రాజేం దర్ పాల్గొన్నారు. అంతకుముందు ఎస్సీ,ఎస్సీ ఆఫీస్‌నుంచి డప్పు చప్పుళ్లు, కోలాట బృందాల నృత్యాతో నాయకులు, అధికారులు జీఎం ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు.