Share News

అమిత్‌ షాను పదవి నుంచి తొలగించాలి..

ABN , Publish Date - Dec 25 , 2024 | 01:00 AM

అంబెద్కర్‌పై అనుచి త వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రిని అమిత్‌షాను పదవి నుంచి తొల గించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్‌ చేశారు.

అమిత్‌ షాను పదవి నుంచి తొలగించాలి..

పెద్దపల్లిటౌన్‌, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్‌షాను పదవి నుంచి తొల గించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్‌ చేశారు. స్థానిక ఐబీ అతిథి గృహంలో మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రాజ్యాంగాన్ని 75 ఏళ్ల క్రితం అంబేద్కర్‌ రాశారని, ఆయన ఇచ్చిన గైడ్‌లైన్స్‌ ప్రకారం దేశ ప్రజలంతా నడుస్తున్నారన్నారు. దేశంలో అన్ని మతాలు, కులాలు కలిసి ఉండటం అంబేద్కర్‌ రాసిన రాజ్యంగం గొప్పతనమన్నారు. బీజేపీకి గత ఎన్నికల్లో 400కు పైగా సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, ముందు నుంచి కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను చైతన్యం చేస్తూనే ఉందన్నారు. అమిత్‌షా వ్యాఖ్యలకు వ్యతి రేకంగా కాంగ్రెస్‌ పార్టీ తరుపున రాహుల్‌గాంధీ నాయకత్వంలో ఎంపీ లందరూ అమిత్‌షాను పార్లమెంటులోనే నిలదీశారన్నారు. అమిత్షా వ్యాక్యలు ఉపసంహరించుకోవాలని, వెంటనే పదవికి రాజీనామా చేసి అంబేద్కర్కు క్షమాపలను చెప్పాలని పోరాటం చేస్తున్నారన్నారు. ఇంకా సమాజంలో మత పిచ్చి, కులపిచ్చి ఉందడం దురదృష్టమన్నారు. కాకా వెంకటస్వామికి కాంగ్రెస్‌ పార్టీతో ఉన్న అనుబంధం కంటే ప్రజలతో ఉన్న అనుబంధం గొప్పదని తెలిపారు. రామగుండంలో ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ఏర్పాటు, సింగరేణిలో కాకా సేవలు ఏ కార్మికుడు మరిచిపోలేదన్నారు, అలాగే కాంగ్రెస్‌ పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ తాగు, సాగునీటి కోసం ప్రాణహిత, చేవేళ్ల ప్రాజెక్టుల కోసం కృషి చేశారు. ప్రత్యేక తెలం గాణ పోరాటంలో కాకా తనదైన శైలిని కనబరిచారన్నారు. అలాంటి కాకా వర్ధంతిని పెద్దపల్లి కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించకపోవడం శోచనీయమన్నారు. కలెక్టర్‌ కుల వివక్షతో వ్యవహరిస్తున్నారన్నారు.

Updated Date - Dec 25 , 2024 | 01:00 AM