Share News

గ్రూప్‌-3 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

ABN , Publish Date - Nov 16 , 2024 | 12:13 AM

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఈనెల 17,18 తేదీల్లో నిర్వహిస్తున్న గ్రూప్‌-3 పరీక్షకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అదనపు కలెక్టర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ తెలిపారు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన గ్రూప్‌-3 పరీక్షా పత్రాలను ఉన్నతాధికారుల సమక్షంలో జడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరిచారు.

గ్రూప్‌-3 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
స్ట్రాంగ్‌ రూమ్‌లో పరీక్షా పత్రాలను భద్రపరిచి తాళం వేయిస్తున్న అదనపు కలెక్టర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌

కరీంనగర్‌ టౌన్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఈనెల 17,18 తేదీల్లో నిర్వహిస్తున్న గ్రూప్‌-3 పరీక్షకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అదనపు కలెక్టర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ తెలిపారు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన గ్రూప్‌-3 పరీక్షా పత్రాలను ఉన్నతాధికారుల సమక్షంలో జడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరిచారు. స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీలను ఆదేశించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ మాట్లాడుతూ జిల్లాలో 26,415 మంది అభ్యర్థులు గ్రూప్‌-3 పరీక్షలు రాసేందుకు 56 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అభ్యర్థులు పరీక్ష మొదలయ్యే సమయానికి గంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. సెల్‌ఫోన్లు, ఎలక్ర్టానిక్‌ వస్తువులు, బ్యాగులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని తెలిపారు. బయోమెట్రిక్‌ హాజరు ఉన్నందున అభ్యర్థులు మెహందీ, టాటూలు పెట్టుకోవద్దని సూచించారు. అడిషనల్‌ కలెక్టర్‌ వెంట ఆర్డీవో మహేశ్వర్‌, సూపరింటెండెంట్‌ కాళి చరణ్‌, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 16 , 2024 | 12:13 AM